ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం పుష్ప. డిసెంబర్ 17న భారీ అంచనాలతో సినిమా ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఇలాంటి తరుణంలో పుష్ప మేకర్స్ కి బాలీవుడ్ సెన్సార్ బృందం భారీ షాక్ ఇచ్చిందని సమాచారం. ఈ సినిమా దాదాపు ఐదు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.
తీరా విడుదలకు రెండు రోజుల ముందు హిందీ వెర్షన్ కు సెన్సార్ నిరాకరించడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా సౌత్ భాషల్లో ఇదివరకే రా-మెటీరియల్ తో సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. అలాంటిది హిందీ వెర్షన్ వచ్చేసరికి సెన్సార్ బోర్డు.. పూర్తి స్థాయి ప్రింట్ తోనే సెన్సార్ చేస్తామని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పుష్ప దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. చూడాలి మరి మేకర్స్ ఎలా స్పందిస్తారో అంటున్నాయి సినీవర్గాలు.
ఇప్పటికే సౌత్ భాషలో టికెట్స్ భారీ లెవెల్లో అమ్ముడుపోతున్నాయి. ఇలాంటి సమయంలో హిందీ వెర్షన్ నుండి బ్యాడ్ న్యూస్ రావడం అనేది అభిమానులకు కూడా షాకింగ్ గానే ఉంది. మరి అంత సవ్యంగానే జరుగుతుందని అనుకుంటుండగా.. ఇలా సెన్సార్ కష్టాలు రావడం ఇండస్ట్రీలో చర్చలకు దారితీస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.