తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు ఈ ఆదివారం(ఫిబ్రవరి 19) జరగబోతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతల మండలి మాజీ అధ్యక్షుడు సి. కళ్యాణ్.. కొంతమంది కలిసి చిన్న సినిమాలను అణగదొక్కుతూ పరిశ్రమను నాశనం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
సినీ ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు ఈ ఆదివారం(ఫిబ్రవరి 19) జరగబోతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతల మండలి మాజీ అధ్యక్షుడు సి. కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నిర్మాతల మండలి సభ్యుల మాఫియా వల్లే ఇండస్ట్రీ ప్రమాదంలో పడబోతుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. కొంతమంది కలిసి చిన్న సినిమాలను అణగదొక్కుతూ పరిశ్రమను నాశనం చేస్తున్నారని కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ఆదివారం జరగనున్న నూతన కార్యవర్గ ఎన్నికల సందర్భంగా మీడియా ముందుకొచ్చిన కళ్యాణ్.. గిల్డ్ పేరుతో సుమారు 27 మంది సభ్యులు ఇండస్ట్రీని దోచుకుంటున్నారని ఆయన అన్నారు.
నిర్మాతల మండలిలో నూతన ఎన్నికలతో పాటు మండలికి, గిల్డ్ కు మధ్య ఉన్న వివాదాలపై మాట్లాడేందుకే సి. కల్యాణ్ ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సి కళ్యాణ్ మాట్లాడుతూ.. “చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయకపోతే పరిశ్రమ మూతపడుతుంది. మోనోపలి వల్ల పరిశ్రమ నాశనం అయ్యే అవకాశం ఉంది. దీనికి మెయిన్ రీసన్ గిల్డ్ మాఫియా. నిర్మాతల మండలిలో మొత్తం 1200 మంది వరకు ఉన్నారు. కానీ.. గిల్డ్ లో ఉన్నది 27 మంది సభ్యులు మాత్రమే. ఆ గిల్డ్ వల్ల ఇండస్ట్రీకి ప్రయోజనాలైతే లేవు. పైగా గిల్డ్ సభ్యుల మధ్య సమస్యలను కూడా నిర్మాతల మండలియే పరిష్కరించింది” అని అన్నారు.
అనంతరం సి కళ్యాణ్ ఇంకా మాట్లాడుతూ.. ‘2019లో మేము వచ్చాక కూడా ఎన్నో సమస్యలు ఫేస్ చేశాం. కానీ.. 30 ఏళ్ళ అనుబంధంతో నిర్మాతల మండలిని కాపాడుకోవాలని ఇప్పుడు ముందుకొచ్చా. గతంలోనే ప్రొడ్యూసర్స్ గిల్డ్ ను నిర్మాతల మండలిలో విలీనం చేసేందుకు ట్రై చేశాం. అధ్యక్ష పదవి మోజులో కొందరు నా ప్రయత్నాన్ని నీరు గార్చేశారు. దిల్ రాజు, సి.కళ్యాణ్ ప్యానెల్ వేరు వేరు కాదు. కొందరు నిర్మాతలు దిల్ రాజును తప్పుదారి పట్టించారు. దిల్ రాజుతో నన్ను పోలుస్తూ దుష్ప్రచారం చేశారు. ఇప్పటిదాకా నేను 80 చిన్న సినిమాలు నిర్మించాను. ఎప్పుడూ ఎవరిని మోసం చేయలేదు. సంస్థకు ఎవరు న్యాయం చేస్తారో వారిని ఎన్నుకోండి. ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయండి. అప్పుడే పరిశ్రమ బాగుంటుంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సి కళ్యాణ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి ఆయన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.