అనిఖా సురేంద్రన్.. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడే హీరోయిన్ గా ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. తెలుగులో బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్టుగా అనిఖా ఎన్నో సినిమాలు చేసింది. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇటీవలే ది ఘోస్ట్ సినిమాలో నాగార్జున మేనకోడలుగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు హీరోయిన్ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. బుట్టబొమ్మ అనే సినిమాలో అనిఖా సురేంద్రన్ హీరోయిన్ నటిస్తోంది. ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిఖా సురేంద్రన్ ను యాంకర్ టాలీవుడ్ హీరోల్లో తన క్రష్ ఎవరని ప్రశ్నించారు. అయితే తనకు పర్టిక్యులర్ క్రష్ అంటూ ఎవరూ లేరు అంటూనే.. విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని చెప్పింది. అంతేకాకుకండా ఇష్టం అంటే ఏ వయసులో అయినా ఉండచ్చని. తనకు విజయ్ దేవర కొండ అంటే ఇష్టమంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ ని విజయ్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. తమ అభిమాన హీరో అంటే తనకు ఇష్టం అనగానే అనిఖాని కూడా వీళ్లు లైక్ చేయడం స్టార్ట్ చేశారు. మరి.. ఈ క్రష్ కామెంట్స్ తన బుట్టబొమ్మ సినిమాకి ఏమైనా ఉపయోగపడతాయేమో చూడాలి మరి.
ఇంక బుట్ట బొమ్మ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా జనవరి 26న విడుదల కావాల్సి ఉంది. కానీ, చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకున్నారు. సినిమా విడుదలను ఫిబ్రవరి 4వ తేదీకీ మార్చుకున్నారు. ఈ సినిమాలో అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ట, అర్జున్ దాస్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. సాయి సౌజన్య, ఎస్.నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శౌరి చంద్రశేఖర్ రమేశ్ డైరెక్టర్ పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా తప్పకుండా అందరినీ ఆలరిస్తుందని, వినోదాన్ని పంచుతుందంటూ చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.