బాలీవుడ్ నుండి సినిమాలు గానీ, టీజర్లు గానీ, ట్రైలర్లు గానీ వస్తున్నాయంటే వెంటనే సినిమాలకి రివ్యూ ఇచ్చేసే క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్. షార్ట్ కట్‌లో కేఆర్‌కే అంటారు. ఇతని పూర్తి పేరు కమల్ రషీద్ ఖాన్. ఇటీవలే ట్విట్టర్‌లో ఆయన పేరుని కమల్ రషీద్ కుమార్‌గా మార్చుకున్నారు. సినిమా ట్రైలర్లు చూసి ఆడుతుందా? లేదా? అని ముందే చెప్పేస్తారు. ఆడితే ఆడుతుందని, లేదంటే ఆడదని ఛాలెంజ్‌లు చేస్తారు. తాజాగా బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటించిన విక్రమ్ వేద సినిమా గురించి కేఆర్‌కే సంచలన ట్వీట్స్ చేశారు. మాధవన్, విజయ్ సేతుపతి నటించిన కోలీవుడ్ మూవీ విక్రమ్ వేదకి రీమేక్‌గా వస్తున్న ఈ మూవీ టీజర్ ఆగస్ట్ 24న రిలీజైంది. ఈ మూవీ ట్రైలర్ మీద ఒక రివ్యూ చేశారు కేఆర్‌కే.
I challenge #HrithikRoshan! If his film #VikramVedha will become a HIT then I will stop reviewing films. And if #VV will become flop then he will cut his 6th finger.🤪😁
— Kamal Rashid Kumar (@kamaalrkhan) August 25, 2022
అంతేకాదు ఈ సినిమా హిట్ అయితే తాను సినిమాలకి రివ్యూలు ఇవ్వడం మానేస్తానని, ఒకవేళ ఫ్లాప్ అయితే హృతిక్ రోషన్ తన ఆరో వేలు కట్ చేసుకోవాలంటూ ట్వీట్ చేశారు. అక్కడితో అయిపోలేదు. రివ్యూ వీడియోలో హృతిక్ రోషన్ పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను హృతిక్ ఒకసారి తన ఇంటికి పిలిచాడని, ఆ సమయంలో తనకు, కంగనాకు మధ్య జరిగిన ప్రతీ విషయాన్ని పూస గుచ్చినట్లు తనకు చెప్పాడని అన్నారు. పైగా అతని ల్యాప్‌టాప్‌లో కంగనాకు సంబంధించి ప్రైవేట్ ఫోటోలు తనకు చూపించాడని, సమయం వచ్చినప్పుడు దీని మీద కూడా ఒక వీడియో చేస్తానని చెప్పుకొచ్చారు కేఆర్‌కే. మరి హృతిక్ రోషన్‌పై కేఆర్‌కే చేసిన కామెంట్స్‌పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.