ఇండస్ట్రీని వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు మృత్యువాత పడుతుండటం విచారకరం. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు ఒకరు మృతి చెందారు. వివరాలు..
2023 ఏడాది ప్రారంభం నుంచి ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే అలనాటి స్టార్ హీరోయిన్ జమున, విశ్వనాథ్, వాణీ జయరామ్.. ఇక తాజాగా నందమూరి తారకరత్న, ఆ తర్వాత మరి కొందరు ప్రముఖులు మృత్యువాత పడ్డారు. వరుస విషాదాల నుంచి ఇండస్ట్రీ కోలుకొలేకపోతుంది. ఒక విషాదాన్ని మర్చిపోయేలోపే.. మరో విషాదం వెలుగు చూస్తుంది. కొందరు వయసు పైబడటం కారణంగా, అనారోగ్య సమస్యల వల్ల మృత్యువాత పడితే.. మరి కొందరు మాత్రం.. బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇక తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు ఒకరు మృత్యువాత పడ్డారు. ఆ వివరాలు..
కామెడీ, విలనిజంతో ప్రేక్షకులను అలరించడమేకాక.. దర్శకుడిగా మెగాఫోన్ చేతబట్టి.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన ప్రముఖ బాలీవుడ్ నటడు సతీష్ కౌశిక్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సతీష్ కౌశిక్ మృతి చెందాడనే విషయాన్ని తెలియజేస్తూ.. 45 యేళ్లుగా సాగిపోతున్న స్నేహం ఈ రోజు ముగిసిందంటూ అనుపమ్ ఖేర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. సతీష్ వయసు 66 సంవత్సరాలు. గతంలో ఆయన కరోనా బారిన పడ్డారు. కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికి.. అనేక ఇతర అనారోగ్య సమస్యలతో గత కొంత కాలంగా బాధ పడుతున్నారు సతీష్. హోలీ పండుగ రోజున.. తన సహనటులతో ఎంతో హుషారుగా హోలీ ఆడిన సతీష్.. ఆ మరుసటి రోజే కన్ను మూశారు. ఆయన హోలీ ఆడిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
जानता हूँ “मृत्यु ही इस दुनिया का अंतिम सच है!” पर ये बात मैं जीते जी कभी अपने जिगरी दोस्त #SatishKaushik के बारे में लिखूँगा, ये मैंने सपने में भी नहीं सोचा था।45 साल की दोस्ती पर ऐसे अचानक पूर्णविराम !! Life will NEVER be the same without you SATISH ! ओम् शांति! 💔💔💔 pic.twitter.com/WC5Yutwvqc
— Anupam Kher (@AnupamPKher) March 8, 2023
ఇక సతీష్ కెరీర్ విషయానికి వస్తే.. ఆయన బాలీవుడ్‌లో సుమారు 100 పైగా చిత్రాల్లో.. ఎన్నో విలక్షణ పాత్రలలో నటించి.. ప్రేక్షకులను అలరించారు. సతీష్ కామెడీ టైమింగ్‌కు చాలా ప్రత్యేకత ఉంది. మిస్టర్ ఇండియాలో ఈయన చేసిన కాలెండర్ పాత్ర ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇక అనిల్ కపూర్, గోవిందాలతో ఈయనది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లతో చేసిన ‘సాజన్ చలే ససురాల్’, ‘దీవానా మస్తానా’ వంటి చిత్రాల్లో సతీష్ పండించిన కామెడీని ప్రేక్షకులు ఎన్నటికి మరవరు.
1956 ఏప్రిల్ 13న జన్మించిన సతీష్ కౌశిక్.. 1983లో వచ్చిన ‘మాసూమ్’ సినిమాతో నటుడిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 1993లో బోనీ కపూర్ నిర్మాణంలో అనిల్ కపూర్, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ‘రూప్ కీ రాణి.. చోరోంకా రాజా’ సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో.. ఆ తర్వాత సతీష్ వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత ‘హమారా దిల్ ఆప్కే పాస్ హై’. ‘హమ్ ఆప్కే దిల్ మే రహతే హై’తో పాటు సల్మాన్‌తో ‘తేరేనామ్’ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు సతీష్. ఎక్కువగా తెలుగులో హిట్టైన చిత్రాలను హిందీలో రీమేక్ చేశారు. ఇక సతీష్ మృతిపై ఇండస్ట్రీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చుతున్నారు.