మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి వార్తలు ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. ప్రభాస్ పెళ్లి వార్త ఎప్పుడు వింటామా అని అభిమానులే కాదు.. సెలబ్రిటీలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో కూడా డార్లింగ్ ని పెళ్ళెప్పుడు అంటూ బాలకృష్ణ అడిగేశారు. కృతిసనన్, అనుష్క ఫోటోలు చూపించి.. వీళ్ళలో ఎవరు అంటూ ప్రభాస్ ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు బాలయ్య. ప్రభాస్ మాత్రం ఏమీ లేదంటూ చెప్పుకొచ్చారు. అయితే రామ్ చరణ్ మాత్రం.. ప్రభాస్ లవ్ లో ఉన్నారని.. త్వరలోనే శుభవార్త చెబుతారని హింట్ ఇచ్చారు. లాస్ట్ లో ఇదంతా ఉత్తుత్తే అని అన్నారనుకోండి. కానీ తాజాగా ఓ బాలీవుడ్ ప్రముఖుడు చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కృతిసనన్, ప్రభాస్ లపై గత కొంతకాలంగా బాలీవుడ్ లో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గాసిప్స్ వినిపించాయి. అయితే తాజాగా ఈ గాసిప్స్ కి బలం చేకూరేలా ఒక ట్వీట్ బాగా వైరల్ అవుతోంది. వచ్చే వారం మాల్దీవుల్లో ప్రభాస్, కృతిసనన్ నిశ్చితార్థం చేసుకోబోతున్నారంటూ ఆ ట్వీట్ సారాంశం. ‘బ్రేకింగ్ న్యూస్: కృతిసనన్, ప్రభాస్ వచ్చే వారం మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకోబోతున్నారు. ఇది వారిద్దరికీ చాలా సంతోషకరమైనది’ అంటూ ట్వీట్ చేశారు బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు. ఆయన ట్వీట్ చేసిన కొన్ని సెకండ్లలోనే అది విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే ఉమైర్ సందు గతంలో ఇలానే ఖచ్చితమైన సమాచారం లేకుండా ట్వీట్లు చేసి ఇరుకున పడ్డారు.
పలువురు సినీ ప్రముఖుల మీద ట్వీట్లు, విమర్శలు, ఆరోపణలు చేసి కేసుల వరకూ తెచ్చుకున్నారు. ఉమైర్ సందు చేసే వ్యాఖ్యలు నిజం కావన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. తాజాగా ప్రభాస్, కృతి సనన్ ల నిశ్చితార్థం అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా నిజం కావని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి అతనికి ఈ సోర్స్ ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు గానీ నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది మంచి వార్తే. కానీ అబద్ధమైతే మాత్రం ఉమైర్ సందు మరోసారి ఇరుకులో పడక తప్పదని అంటున్నారు. ఆ మధ్య ‘మాల్దీవుల్లో ప్రభాస్- కృతిసనన్ న్యూ ఇయర్ వేడుకలంటూ’ ట్వీట్ చేసి అందరినీ బురిడీ కొట్టించాడు. ఈసారి కూడా అదే అయి ఉండవచ్చునని, పబ్లిసిటీ కోసం ఇలా ట్వీట్లు చేస్తూ ఉంటాడని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఉమైర్ సందు చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
BREAKING NEWS: #KritiSanon & #Prabhas will get engaged next week in Maldives 🇲🇻!! So Happy for them.— Umair Sandhu (@UmairSandu) February 5, 2023