సోషల్ మీడియా అన్న తర్వాత పాజిటివిటీ ఎంత ఉంటుందో.. నెగెటివ్ కూడాఅంతే ఉంటుంది. ఒక విషయాన్ని పొగిడేవాళ్లు ఉంటారు.. తిట్టేవాళ్లుంటారు. కొందరైతే క్రిటిక్ అనే పేరు పెట్టుకుని వారికి నచ్చింది మాట్లాడుతుంటారు. అలాంటి జాబితాలో మోస్ట్ కాంట్రవర్షిల్ బాలీవుడ్ క్రిటిక్ ఎవరైనా ఉన్నారంటే అది కేఆర్కే అని చెప్పాలి. ఆయనకు ట్విట్టర్ లో 5.1 మిలియన్ ఫాలోవర్లు కూడా ఉన్నారు. సాధారణంగా ఎవరన్నా 10 పాజిటివ్ మాట్లాడితే ఎక్కడో ఒక దగ్గర నెగటివ్ కామెంట్ చేస్తుంటారు. కానీ, కేరఆర్కే మాత్రం 10లో 11 నెగెటివ్ కామెంట్సే చేస్తుంటాడు. తాజాగా ఓ స్టార్ యాంకర్ పుట్టినరోజు నాడు అతని పరువు మొత్తం తీసేశాడు.
ఇదీ చదవండి: అటాక్ మూవీ వసూళ్లపై నెటిజన్స్ సెటైర్లు.. ‘కలెక్షన్స్ చూస్తే తెలుస్తోందిలే మీ నంబర్ ఎంతో’
అతను మరెవరో కాదు.. ప్రముఖ కమెడియన్, స్టార్ యాంకర్ కపిల్ శర్మ. కపిల్ కు బాలీవుడ్ లోనే కాదు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అతని కామెడీ టైమింగ్ అన్నా.. కపిల్ శర్మ షో అన్నా విపరీతంగా ఇష్టపడుతుంటారు. ఏప్రిల్ 2న కపిల్ పుట్టినరోజు నాడు కేఆర్కే అతని పరువు తీసేసేలా.. ఘోరంగా అవమానిస్తూ ట్వీట్ చేశాడు. ‘అత్యంత అసభ్యకరమైన, సిగ్గులేని, ఘటియా, పియక్కడ్ మనిషి కపిల్ శర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ అతని పరువు తీసేశాడు. అయితే కేఆర్కే ఇలాంటి మాటలు అనడం, ట్వీట్లు చేయడం కొత్తేం కాదు. ప్రతి ఒక్కరిని, ప్రతి విషయాన్ని, ప్రతి సినిమాపై కేఆర్కే ఇలాంటి రీతిలోనే స్పందిస్తుంటాడు. అయితే పుట్టినరోజు ఇలాంటి శుభాకాంక్షలు చెప్పడం దారుణం అంటూ నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. కేఆర్కే ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Wishing you a very happy birthday the most Vulgar, shameless, Piyakkad, Ghatiya and Waahiyat Insaan #KapilSharma! Keep doing comedy.
— KRK (@kamaalrkhan) April 2, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.