బిత్తిరి మాటలతో.. బిత్తిరోడిలా నటిస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించే బిత్తిరి సత్తి రేంజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. టాపిక్ ఏదైనా ట్రాఫిక్ క్రియేట్ చేయగల టాలెంట్ ఉన్న వ్యక్తి బిత్తిరి సత్తి. అద్భుతమైన పద ప్రయోగంతో నవ్వించగల నేర్పరి. టీవీ షోస్ లో కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన బిత్తిరి సత్తి.. మహేష్ బాబు, గోపీచంద్ వంటి స్టార్ హీరోలను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తూ మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. పలు కామెడీ షోస్ లో తనదైన హాస్యంతో నవ్వించిన బిత్తిరి సత్తి.. పలు సినిమాల్లో కూడా నటించారు. నటుడు అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి.. అవకాశాలు లేక బుల్లితెర మీద హాస్యనటుడిగా కెరీర్ స్టార్ట్ చేశారు. కామెడీ క్లబ్ అనే షోతో ఎంట్రీ ఇచ్చిన బిత్తిరి సత్తి.. తీన్మార్ షో ద్వారా పాపులర్ అయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ బిత్తిరి సత్తి అనే ఒక బ్రాండ్ ని పరిచయం చేశారు. ఈయన అసలు పేరు రవి కుమార్. కానీ అందరికీ బిత్తిరి సత్తిగానే పరిచయమయ్యారు. అలానే కొనసాగుతున్నారు కూడా. మిమిక్రీ టాలెంట్ ఉంది, యాక్టింగ్ టాలెంట్ ఉంది. అయినా గానీ కొత్తగా చేయాలని బిత్తిరి సత్తిగా ఎంట్రీ ఇచ్చారు. చేవెళ్ల ప్రాంతానికి చెందిన బిత్తిరి సత్తి.. సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. చాలా కష్టాలు పడి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ఏమీ లేని స్థితి నుండి తనకంటూ ఏమీ లేవు అన్న లోటు లేని స్థితికి రాగలిగారంటే అది బిత్తిరి సత్తి వన్ అండ్ ఓన్లీ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అని చెప్పాలి. ఇక రవికుమార్ ఒక పక్క సినిమాలు, సినిమా ప్రమోషన్లు, సెలబ్రిటీల ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో బిజీ బిజీగా ఉన్నారు. ఇంత బిజీగా ఉంటే పారితోషికం కూడా భారీగానే ఉంటుంది.
మరి అంత పారితోషికం వస్తున్నప్పుడు, సత్తి రేంజ్ పెరిగినప్పుడు.. ఆ రేంజ్ కి తగ్గా కారు ఒకటి లేకపోతే బాగోదుగా. అందుకే బిత్తిరి సత్తి రేంజ్ రోవర్ కారు కొనేశారు. లగ్జరీ కార్లలో బెంజ్, రేంజ్ రోవర్ కార్లని సెలబ్రిటీలు తమ స్టేటస్ సింబల్ లా భావిస్తారు. అలా బిత్తిరి సత్తి కూడా రేంజ్ రోవర్ కారుని సొంతం చేసుకున్నారు. దసరా సమయంలో చాలా మంది కొత్త వస్తువులు కొనేందుకు మొగ్గు చూపుతారు. ముఖ్యంగా ఆరోజున వాహనాలు కొనడం శుభపరిణామంగా భావిస్తారు. ఈ క్రమంలోనే బిత్తిరి సత్తి రేంజ్ రోవర్ బ్లాక్ కలర్ కారుని కొనుగోలు చేశారు. రేంజ్ రోవర్ బేస్ మోడల్ రెండున్నర కోట్లు ఉండగా.. టాప్ మోడల్ ధర 4 కోట్ల పైనే ఉంది. ఏ మోడల్ అనేది తెలియదు గానీ స్టార్ స్టేటస్ ఉన్న సెలబ్రిటీలు వాడే రేంజ్ రోవర్ ని ఇప్పుడు రవి కుమార్ సొంతం చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి కొనుగోలు చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బిత్తిరి సత్తికి అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు.