బిగ్ బాస్ .. తెలుగు ప్రేక్షకులకు బాగా ఇష్టమైన గేమ్ షో. ఈ షోలో ఉండే హ్యూమన్ ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇందుకే భాషతో సంబంధం లేకుండా బిగ్ బాస్ అన్నీ ప్రాంతాల్లో సూపర్ హిట్ అయ్యింది. జూనియర్ యన్టీఆర్ తెలుగు నాట ఈ షోకి సేఫ్ లాంచింగ్ ఇవ్వగా, అక్కడ నుండి నాగార్జున షోని పర్ఫెక్ట్ గా హోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 4 ముగిసి చాలా కాలం అవుతోంది. దీంతో.., కొంత కాలంగా ప్రేక్షకులు సీజన్-5 ఎప్పుడు మొదలవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే.., ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-5 కి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బిగ్ బాస్-5 సీజన్ సెప్టెంబర్ 5వ తేదిన ఆరంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే పార్టిసిపెంట్స్ విషయంలో కూడా నిర్వాహకులకు ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అందరితో సంప్రదింపులు పూర్తి అయ్యాయని, త్వరలోనే అగ్రిమెంట్స్ కుదుర్చుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హోస్ట్ నాగార్జున కూడా ఈ డేట్ కి ఓకే చెప్పడంతోనే నిర్వాహకులు షో స్టార్ట్ చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, టిక్టాక్ స్టార్ దుర్గారావు, యాంకర్ వర్షిణి, కమెడియన్ ప్రవీణ్, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, హైపర్ ఆది, సింగర్ మంగ్లీ, న్యూస్ యాంకర్ ప్రత్యూష వంటి వారు ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బయట ఈవెంట్స్ అస్సలు లేవు. షూటింగ్స్ కూడా ఎప్పుడు మొదలవుతాయో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మంచి స్టార్స్ డేట్స్ అడ్జెస్ట్ అవ్వొచ్చన్న ఆలోచనలో ఉన్నారట నిర్వాహకులు. ఇక షోని కూడా 100 రోజులకి పైగానే ప్లాన్ చేస్తున్నారట. సో.., ఈసారి ప్రేక్షకులకి డబుల్ డోస్ గ్యారంటీ.