బిగ్ బాస్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త సీజన్ రానే వచ్చింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్.. అంటూ రాబోతున్న ఈ ఓటిటి సీజన్ ఫిబ్రవరి 26 నుండి ప్రారంభం కానుందనే విషయం అందరికి తెలిసిందే. ఓటిటి సీజన్ కాబట్టి ఇకపై బిగ్ బాస్ ఇంటి సభ్యులంతా 24 గంటలపాటు కెమెరా కంట్లోనే ఉంటారు. అయితే.. నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్ ప్రోమో వచ్చింది కానీ.. ఈసారి ఎవరెవరు పాల్గొంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే బిగ్ బాస్ ఓటిటి సీజన్ లో పాల్గొంటున్నారని కొందరి పేర్లు వైరల్ అవుతున్నాయి. అందులోను కొత్త ముఖాలు తక్కువగా, పాత ముఖాలు ఎక్కువగా కనిపించనున్నాయని టాక్ నడుస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా బిగ్ బాస్ ఓటిటి నుండి కొత్త ప్రోమో రిలీజ్ అయింది. ఫిబ్రవరి 26 నుండి షో మొదలనే సంగతి తెలుసు.. కానీ ఏ టైంలో అనేది ఈ కొత్త ప్రోమో ద్వారా తెలిపారు.
లేటెస్ట్ ప్రోమో చూసినట్లయితే.. బిగ్ బాస్ ఓటిటి సీజన్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ సెట్ కూడా సరికొత్తగా ఉండబోతుందని అర్థమవుతుంది. ఇక ఆటాపాటా ప్రదర్శనలకు కొదవే లేదు. అయితే.. డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం కానున్న ఓటిటి సీజన్ లో ఈసారి కంటెస్టెంట్స్ గా 18 మంది పాల్గొంటున్నారు. మరి ఈ కొత్త ప్రోమో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.