బిగ్ బాస్ రియాలిటీ షో ఇకపై నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు రెడీ అవుతోంది. ఫిబ్రవరి 26న ప్రారంభం కానున్న బిగ్ బాస్ ఓటిటి సీజన్ కోసం యువత, టీవీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం చేయనున్న ఈ బిగ్ బాస్ ఓటిటి సీజన్ కి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు.
ఇదివరకు 5 సీజన్లు టీవీలో 1-2 గంటలే ప్రసారమయ్యేది. ఇప్పుడు ఓటిటి కాబట్టి 24 గంటలు లైవ్ ప్రసారం చేయబడుతుంది. కాబట్టి ఈసారి షోలో పాల్గొనే వారంతా ఎక్కువ గంటలు అలర్ట్ గా ఉంటూ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఈ కారణంగా బిగ్ బాస్ ఓటిటిలో పాల్గొనే కంటెస్టెంట్లు రెమ్యూనరేషన్ ఎక్కువగా డిమాండ్ చేస్తున్నట్లు టీవీ వర్గాల సమాచారం.ప్రస్తుతానికి కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ గత సీజన్లలో పాల్గొన్న పాత కంటెస్టెంట్స్ కూడా మరోసారి తమ లక్కును పరీక్షించుకోబోతున్నారట. ఇక పాతవాళ్లతో పాటు కొత్తగా కొంతమంది యూట్యూబ్ స్టార్స్, యాంకర్స్ అలాగే సీరియల్ నటీనటులు కూడా కంటెస్టెంట్స్ రాబోతున్నారట. అయితే.. ఈసారి బిగ్ బాస్ లో గ్లామర్ డోస్ పెంచేందుకు లేడీ కంటెస్టెంట్స్.. కేవలం కాస్ట్యూమ్స్ కోసమే లక్షల్లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బిగ్ బాస్ లో పాల్గొనేవారు వీరేనంటూ పలువురి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈసారి ఎవరెవరు ఫైనల్ జాబితాలో చోటు సంపాదించుకుంటారో.. హౌజ్ లో ఎంతకాలం కొనసాగుతారో.. ఎవరెవరు ఎంత పట్టుకెళ్తారో చూడాలి. మరి బిగ్ బాస్ ఓటిటి సీజన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.