‘గుంటూరు కారం’ నుంచి తమన్, హీరోయిన్ పూజా హెగ్డేను తప్పించారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సెటైరికల్ ట్వీట్ చేశారు.
మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మధ్యే ఈ మూవీకి సంబంధించి గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. కాగా, ఈ సినిమా షూటింగ్ సైతం కొంత వరకు పూర్తైనట్లు సమాచారం. జులై నుంచి కొత్త షెడ్యూల్ ను ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఇక త్వర త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర దర్శకుడు, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ఇకపోతే, ఈ సినిమా సంగీత దర్శకుడు తమన్, హీరోయిన్ పూజా హెగ్డేను మూవీ యూనిట్ తప్పించినట్లు ఫిల్మ్ నగర్ లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తమన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. సెటైరికల్ గా గట్టిగానే సమాధానం ఇచ్చాడు. దీంతో ఇవన్నీ పుకార్లే అని మరి కొందరు అనుకుంటున్నారు. అయితే, ఒకేసారి హీరోయిన్, సంగీత దర్శకుడిని మూవీ నుంచి తప్పించడం ఏంటని ఫ్యాన్స్ అయోమాయంలోకి వెళ్లిపోతున్నారు.
Bananas 🍌 are very healthy for tummy Burning’s 😉
Beeewwwwwwww 🤐tats a lovely burps 🤠 pic.twitter.com/i8Tq0N6oXL— thaman S (@MusicThaman) June 19, 2023
ఈ తరుణంలోనే ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇన్ డైరెక్ట్ గా త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ.. సినిమా ఉందా అది కూడా ఎక్కించేశావా అంటూ కామెంట్స్ రాసుకొచ్చారు. తాజాగా బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారుతోంది. అయితే, మొత్తానికి ‘గుంటూరు కారం’ నుంచి తమన్, పూజా హెగ్డేను నిజంగానే తప్పించారా? లేక ఇవన్నీ పుకార్లేనా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
సినిమా ఉందా అది కూడా ఎక్కించేసావా 😜😜😜😜😜😜 @sairaaj44
— BANDLA GANESH. (@ganeshbandla) June 20, 2023