వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తర్వాత సినీ ఇండస్ట్రీలో ఆ స్థాయిలో ట్రెండ్ అయ్యే కాంట్రవర్సీ సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారంటే.. అది బండ్ల గణేష్ అనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉండే నటులలో బండ్ల గణేష్ ముందుంటారు. ఆయన ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటుంది. అప్పుడప్పుడు బండ్ల గణేష్ కూడా వార్తల్లో హాట్ టాపిక్ అవుతుంటాడు. అయితే.. బండ్ల గణేష్ కి మెగా ఫ్యామిలీపై, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై ఉన్నటువంటి అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇక చాలాకాలం తర్వాత బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో ‘డేగల బాబ్జీ’ సినిమా చేశాడు. ఇటీవలే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే.. డేగల బాబ్జీ చిత్రబృందం యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరించే క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొంది. ఈ ప్రోగ్రాంకి బండ్ల గణేష్ కూడా హాజరయ్యాడు. తాజాగా డేగల బాబ్జీ టీమ్ పాల్గొన్న ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రోమో చూస్తే.. బండ్ల గణేష్ చాలా ఉత్సాహంగా యాంకర్ సుమపై నాన్ స్టాప్ పంచులు వేస్తూ అలరించాడు.
ఇదిలా ఉండగా.. ప్రోమో చివరలో బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యాడు. యాంకర్ సుమ కోవిడ్ టైంలో స్ట్రగుల్ అయ్యారంట కదా..? అని అడిగింది. వెంటనే స్పందించిన గణేష్.. “అవును. మూడు వేవ్ లు పలకరించి వెళ్లాయి. సెకండ్ వేవ్ లో చాలా ఇబ్బంది పడ్డాను. చాలా సీరియస్ అయ్యింది. చిరంజీవి గారే అప్పుడు నన్ను హాస్పిటల్ లో జాయిన్ చేసి చాలా కేర్ తీసుకున్నారు.” అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం గణేష్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి బండ్ల గణేష్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.