రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ రెండ్రోజుల ముందే మొదలైపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి నటసింహం బాలకృష్ణ, తెలుగు సినిమా ప్రేక్షకులు వీర సింహారెడ్డి సినిమా రూపంలో సంక్రాంతిని ముందే ఆహ్వానించేశారు. ఈ సినిమా ఇండియాలో జనవరి 12న విడుదల కానున్న విషయం తెలిసిందే. తెలంగాణలో అయితే తెల్లవారుజామున 4 గంటలకే ఫస్ట్ షో పడిపోయింది. ఇక సినిమా చూసిన చాలామంది ఫ్యాన్స్ అప్పుడే ట్విట్టర్ లో సినిమా గురించి ట్వీట్స్ పెడుతున్నారు. మరి వాళ్లు ‘వీరసింహారెడ్డి’ ఎలా ఉందని చెప్పారు? టాక్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.
వీర సింహారెడ్డిలో బాలయ్య డబుల్ యాక్షన్ తో ఇరగదీశాడంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వీర సింహారెడ్డి, జయసింహా రెడ్డిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడంటూ చెప్తున్నారు. రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో గోపీచంద్ మలినేనికి ఫుల్ మార్క్స్ పడిపోయాయని చెబుతున్నారు. లీడ్ రోల్స్ లో శ్రుతీ హాసన్, వరలక్ష్మీ యాక్టింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. హీరోయిన్ గా శ్రుతీహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, లేడీ విలన్ గా మాత్రం వరలక్ష్మీ శరత్ కుమార్ కు మంచి మార్కులే పడుతున్నాయి.
వీరసింహారెడ్డిపై పాజిటివ్ తో పాటు పలువురు ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఫస్టాప్ అదరగొట్టిప్పటికీ సెకాండాఫ్ తేలిపోయిందని ట్వీట్స్ చేస్తున్నారు. సింహా, లెజెండ్ సినిమాలు మిక్సీలో వేసి తీశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొంతలో కొంత శ్రుృతి హాసన్ యాక్టింగ్ ఆకట్టుకుందని అంటున్నారు. ఎప్పటిలానే బాలయ్య డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో రీసౌండ్ వచ్చేలా చేశారని ట్వీట్స్ చేస్తున్నారు. అటు బాలయ్య ఫ్యాన్స్ కి సినిమా తెగ నచ్చేస్తుంటే.. నార్మల్ ఆడియెన్స్ మాత్రం సినిమా యావరేజ్, రొటీన్ గా ఉందంటున్నారు. ఇక యాంటీ ఫ్యాన్స్ అయితే బాలయ్య కాబట్టి సినిమా నడిచిపోతుందని ట్వీట్స్ చేస్తున్నారు.
ఇక నిర్మాణం విషయానికి వస్తే.. మైత్రీ మూవీ మేకర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాని తెరకెక్కించినట్లు, ఎలివేషన్స్ లో బాలయ్యను నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. సంగీతం గురించి ప్రేక్షకులకు ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. తమన్ అఖండ తరహాలో మ్యూజిక్ అందించాడంటూ సంబరాలు చేసుకుంటున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ, రామ్- లక్ష్మణ్ ఫైట్స్ సినిమాని నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లాయి. ఎక్కడా బోర్ లేకుండా నవీన్ నూలి ఎడిటింగ్ కూడా అందరినీ ఆకట్టుకుందంటున్నారు. సంక్రాంతికి బాలయ్య ఖాతాలో హిట్ పడినట్లే అంటూ ఫ్యాన్స్ సంబరాలు స్టార్ట్ చేసేశారు.
Good & fans stuff first half🥁
Unfortunately ultra scrap & below par second half🚶
Ee content thoo full run kastam ha….#VeeraSimhaReddy— చిన్న రామయ్య ⒻⒶⓃ ➐ (@likith_09) January 12, 2023
#VeeraSimhaReddy Show Finished Now Usa
Overall, reports are poor!
Rating : 2/5#VeeraShimaReddyDisaster #VeeraSimhaReddyOnJan12th #Balayya #VeeraSimhaReddyreview pic.twitter.com/4z6ghNAxso
— RIYAS (@riyasalpha) January 11, 2023
complete 1st off OMG 👌💥
Movie లో ఈ గెటప్ సూపర్ 🔥🔥@MusicThaman Anna BGR ke Theatre🔥🥵💥 @shrutihaasan Suguna Sundari Dance 👌🔥 @varusarath5 in interval 🔥🔥🔥👌 #Balakrishna action sequences🔥dialogues Delivery 🔥 @MythriOfficial#VeeraSimhaaReddy#VeeraSimhaReddyOnJan12th pic.twitter.com/4QSw7x3ITR— N.Ashok Gowda (@07Ashok_gowda) January 12, 2023