నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ మెచ్చిన మాస్ హీరో. ఆయనకు సరైన స్టోరీ పడాలే గానీ బొమ్మ బ్లాక్ బస్టర్ కావడం గ్యారంటీ. ఆయన ఏ మూవీ చేసినా సరే ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తుంటారు. ప్రస్తుతం ‘వీరసింహారెడ్డి’ చేస్తున్న ఆయన.. దీని తర్వాత కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పనిచేయనున్నారు. దీని గురించి చాలారోజుల క్రితమే ప్రకటన వచ్చింది. అప్పటి నుంచి ఈ కాంబో గురించి అభిమానులు తెగ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ కాంబోని ఎక్స్ పెక్ట్ చేయలేదు కాబట్టి. ఇక వీళ్లిద్దరికి సింక్ ఎలా కుదురుతుంది తల బద్దలు కొట్టేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు వాటన్నింటిపై డైరెక్టర్ అనిల్ క్లారిటీ ఇచ్చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నందమూరి కల్యాణ్ రామ్ ‘పటాస్’తో దర్శకుడిగా అనిల్ రావిపూడి పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరసగా సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 లాంటి హిట్లతో ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి పనిచేసే ఛాన్స్ కొట్టేశాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బంపర్ హిట్ కొట్టిన అనిల్.. దీని తర్వాత ‘ఎఫ్ 3’తో ప్రేక్షకుల్ని పలకరించారు. ఇప్పుడు బాలకృష్ణతో సినిమా చేయడానికి రెడీ అయిపోయారు. వీరిద్దరూ కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. థియేటర్లలో పునకాలు రావడం కన్ఫర్మ్ అని మాట్లాకుంటున్నారు. ఇప్పుడు దాన్ని డబుల్ చేసేలా అనిల్ రావిపూడి ఆసక్తికర విషయాలని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.
‘బాలయ్యతో సినిమా అంటే అభిమానులు అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. ఆయన లాంటి సూపర్ పవర్ తో ప్రాజెక్ట్ అంటే ఆ మాత్రం ఎక్స్ పెక్టేషన్స్ ఉండటం కామన్. ఇదో ప్రత్యేకమైన కాంబినేషన్, సినిమా కూడా అంతే డిఫరెంట్ గా ఉంటుంది. ఆయనతో సినిమా చేస్తున్నానని ఎలాంటి ఒత్తిడి లేదు. చిన్నప్పటి నుంచి బాలయ్య సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన బాడీ లాంగ్వేజ్ కు ఏది సూట్ అవుతుంది? ఏది కాదో ఫెర్ఫెక్ట్ గా అనలైజ్ చేయగలను. స్టోరీలోని బీట్స్ నచ్చితేనే బాలయ్య ఆ ప్రాజెక్టు ఓకే చేస్తారు. కాబట్టి ఆయన్ని మెప్పించాలంటే కథని ఒళ్లు దగ్గరపెట్టుకుని సిద్ధం చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఆయన కథకు ఆమోదం చెబితే సగం సినిమా పూర్తయినట్లే’ అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.