నటసింహం నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వేటకు సిద్ధమైపోయాడు. అఖండ, అన్ స్టాపబుల్ సినిమాలతో సూపర్ ఫామ్ లో ఉన్న బాలయ్య.. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు ‘వీరసింహారెడ్డి’ మూవీని రెడీ చేశాడు. మైత్రి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాని గోపీచంద్ మలినేని తెరకెక్కించాడు. పక్కా మాస్ యాక్షన్ సినిమాగా రూపొందించిన ఈ సినిమాని.. సంక్రాంతి కానుకగా.. జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఒంగోలులో ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా.. సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు.
బాలయ్య డైలాగ్స్.. డాన్స్.. మాస్ యాక్షన్ సీక్వెన్సులు.. ఫైట్స్.. ఎమోషన్స్.. నందమూరి ఫ్యాన్స్ కి ఏమేం కావాలో అన్ని మాస్ అంశాలను ఒక్క తాటిపై చేర్చి వీరసింహారెడ్డి ట్రైలర్ ని కట్ చేశారు. లుంగీ కట్టి.. మాస్ లుక్కులో బాలయ్య నోటి నుండి వచ్చే ప్రతి డైలాగ్.. ఫ్యాన్స్ కి థియేటర్స్ లో పూనకాలు తెప్పించడం గ్యారంటీ అని చెప్పాలి. ఒక సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, సింహ, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్ బస్టర్స్ తరహాలో వీరసింహారెడ్డి మరో బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని ట్రైలర్ లో విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. అఖండ సినిమాతో తమన్ బాలయ్య సినిమాలకు ఏ స్థాయిలో రఫ్ఫాడిస్తాడో చూపించేశాడు.
ఈసారి బాలయ్య మాసిజంకి మరింత బేస్ యాడ్ చేసి.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టాడేమో అనిపిస్తోంది. ట్రైలర్ ని చాలా ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ తో షార్ప్ గా కట్ చేశారు మేకర్స్. క్లైమాక్స్ లో ఎమోషన్స్ కూడా చూపించారు. అయితే.. ట్రైలర్ డైలాగ్స్ చూస్తే.. ‘సీమలో ఏ ఒక్కడు కత్తి పట్టకూడదని నేను పట్టా.. పరపతి కోసమో పెత్తనం కోసమో కాదు.. ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత’, ‘నాది ఫ్యాక్షన్ కాదు.. సీమపై ఎఫెక్షన్’. ‘వీరసింహ రెడ్డి.. పుట్టింది పులిచెర్ల చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్’.. ‘అప్పోయింట్ మెంట్ లేకుండా వస్తే.. లొకేషన్, అకేషన్ చూడను.. ఊచకోత కోస్తా నా కొడకా” అంటూ ఎన్నో పవర్ ఫుల్ డైలాగ్స్ తో మాస్ బిర్యానీ రెడీ చేసాడు డైరెక్టర్. ప్రస్తుతం వీరసింహారెడ్డి ట్రైలర్ ఫ్యాన్స్ ని, నెటిజన్స్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలు పెంచేసిన ఈ ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.