బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి రెబల్ స్టార్ ప్రభాస్ డార్లింగ్ వచ్చారని చెప్పు, ఎపిసోడ్ మామూలుగా ఉండదని చెప్పు అని ఫ్యాన్స్ కి పిచ్చ కిక్ ఇచ్చారు ప్రభాస్. బాలకృష్ణ షోకి ప్రభాస్ వెళ్తున్నారని తెలియగానే సోషల్ మీడియా మొత్తం షేకైపోయింది. ఇప్పటి వరకూ ప్రోమోలతో సరిపెట్టుకున్న ఫ్యాన్స్.. ఫుల్ పిక్చర్ ఎప్పుడెప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఆహా టీమ్ బిగ్ అప్డేట్ ఇచ్చేసింది. స్ట్రీమింగ్ డేట్ ని అనౌన్స్ చేసేసింది. ఇవాళ మరో ప్రోమోని వదిలిన షో నిర్వాహకులు.. ఫుల్ ఎపిసోడ్ కి సంబంధించి స్ట్రీమింగ్ డేట్ వెల్లడించారు. ప్రోమో మాత్రం అద్దిరిపోయింది అంతే. ఇప్పటివరకూ ఒక లెక్క, ఇప్పటినుంచి ఒక లెక్క అన్నట్టు ఉంది.
ప్రభాస్ గోత్రం చెప్పి.. ‘ఉప్పలపాటి ప్రభాస్ రాజు నామధేయస్య.. బహుపరాక్’ అంటూ గూస్ బంప్స్ తెప్పించే బాహుబలి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఘనస్వాగతం పలికారు బాలకృష్ణ. లెజెండ్ సినిమాలో పాపతో ‘ఏది ఒకసారి మావయ్య అను’ అని అడిగి మావయ్య అని పిలిపించుకున్నట్టు.. తనను ప్రేమగా డార్లింగ్ అని పిలవమని ప్రభాస్ ని రిక్వస్ట్ చేశారు. దీంతో ప్రభాస్ సరే డార్లింగ్ సార్ అని అన్నారు. డార్లింగ్ కి సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఎక్కువే. ‘మొన్నా మధ్య శర్వానంద్ వచ్చాడు. పెళ్ళెప్పుడు అంటే ప్రభాస్ పెళ్లి తర్వాత అన్నాడు’ అని బాలకృష్ణ అనగా.. ‘నేను సల్మాన్ తర్వాత అనాలేమో’ అంటూ హ్యూమర్ ప్రదర్శించారు.
నీ లైఫ్ లో మోస్ట్ రొమాంటిక్ సీన్ ఏంటి అని అడగ్గా.. చాలా ఇబ్బంది పడ్డారు డార్లింగ్. “మీకు ఏ ఇబ్బందులూ లేవు అప్పుడు.. ఇప్పుడు మాకు ఏదీ లేకపోయినా అనవసరమైన గోల ఎక్కువ” అని ప్రభాస్ అన్నారు. ఇలా ప్రభాస్, బాలకృష్ణ ఇద్దరూ చాలా గోల గోల చేశారు. ఆ తర్వాత బాలకృష్ణ.. చరణ్ కి కాల్ చేసి ప్రభాస్ ని ఆటపట్టించారు. “ఓ చరణూ.. రేయ్ నువ్వు నా ఫ్రెండా? శత్రువా?” అని అన్నారు. ఇలా సాగుతుండగా మధ్యలో మ్యాచో స్టార్ గోపీచంద్ ఎంట్రీ ఇచ్చారు. “మనవాడు నా బెస్ట్ ఫ్రెండ్ అండి అని రామ్ చరణ్ కి ఫోన్ చేశాడు. చరణ్ చిన్న లీక్ న్యూస్ ఇచ్చాడు” అని బాలకృష్ణ అనగానే.. “రాణి గురించే కద సార్” అని గోపీచంద్ అన్నారు. దీంతో ప్రభాస్ ఒరేయ్ అంటూ ఇరికించకురా అన్నట్టు ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు.
2008వ సంవత్సరంలో ఏదో హీరోయిన్ కోసం గొడవపడ్డారు. మనోడే పడేస్తాడో.. వాళ్ళ కటౌట్ చూసి పడిపోతారో అర్థం కావట్లేదు” అని బాలకృష్ణ అనగానే.. “చెప్పరా నేనైతే పడలేదు. నీకేమైనా ఉంటే చెప్పు” అంటూ గోపీచంద్ ని ఇరికించే ప్రయత్నం చేశారు ప్రభాస్. ఆ తర్వాత బాలకృష్ణ ఒక ఫోటో చూపించగా.. “మా అమ్మ కంగారుపడిపోద్ది సార్” అని అన్నారు. “గోపీ ఆ ఫోటో తీసింది నువ్వే..” అని బాలకృష్ణ అనగా.. “రేపు సోషల్ మీడియాలో నేను తట్టుకోలేను” అని ప్రభాస్ అన్నారు. ఇలా వీడియో మొత్తం ప్రభాస్ ని బాలకృష్ణ, గోపీచంద్ సరదాగా ఆటపట్టించినట్టు ఉన్నారు. అయితే 2008లో ఒక హీరోయిన్ కోసం ఇద్దరూ గొడవపడినట్లు బాలకృష్ణ ఇంట్రస్టింగ్ మేటర్ ఒకటి బయటపెట్టారు.
ఇంతకే ఆ హీరోయిన్ ఎవరై ఉంటుంది? సినిమాలో హీరోయిన్ కోసం కొట్టుకున్నారు అని అనుకున్నా ఇద్దరూ కలిసి నటించిన వర్షం సినిమా 2004లో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి ఏ సినిమా చేయలేదు. వ్యక్తిగతంగా ఇద్దరూ స్నేహితులు కావడంతో రెగ్యులర్ గా కలుసుకోవడం.. ఆ సమయంలో హీరోయిన్ విషయంలో గొడవ పడ్డారా? మరి ఆ హీరోయిన్ ఎవరో మీకు తెలిస్తే చెప్పండి పెండ్స్. అలానే ప్రోమో ఎలా ఉందో, ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో కూడా చెప్పండి. ఇక అన్ స్టాపబుల్ షో డిసెంబర్ 30న స్ట్రీమింగ్ కాబోతుంది. “అబ్బా కడుపు నిండిపోయింది బంగారం” అని ప్రతీ ఒక్కరూ అనేలా ఈ ఎపిసోడ్ ఉంటుందని ప్రోమో చూస్తేనే తెలుస్తుంది. ఏ మాట కా మాట, డార్లింగ్ చరణ్, గోపీచంద్ లని ఒరేయ్ అని ప్రేమగా పిలుస్తుంటే.. వీళ్ళ స్నేహం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇలాంటి స్నేహమే కావాలి. హీరోలు ఇలా ఉంటేనే అందరి హీరోల అభిమానులు కలిసి మెలిసి ఉంటారు. మరి దీనిపై మీరేమంటారు?