నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ మూవీలో బాలయ్యకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. ఇక సంక్రాంతి బరిలోకి దిగనున్నాడు బాలయ్య ఈ నెల 12వ తారిఖున ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దాంతో ప్రమోషన్స్ మెుదలు పెట్టింది చిత్ర బృందం. అందులో భాగంగానే శుక్రవారం సాయంత్రం ఒంగోలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. ఈవెంట్ కు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మెయినాబాద్ నుంచి ఒంగోలు కు ప్రత్యేక చాపర్ లో బయలుదేరారు బాలయ్య.
వీరసింహారెడ్డి.. నందమూరి బాలకృష్ణ హీరోగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం. స్టార్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. స్టార్ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్నో ఆటంకాల నడుమ, పోలీసు ఆంక్షల నడుమ వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను శుక్రవారం ఒంగొలులో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు మెుయినాబాద్ నుంచి ప్రత్యేక చాపర్ లో బయలుదేరారు బాలకృష్ణ. బాలయ్యతో పాటుగా చాపర్ లో హీరోయిన్ శృతిహాసన్, నిర్మాత నవీన్ ఎర్నేనీతో పాటు బి.గోపాల్ కూడా ఉన్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ కూడా రిలీజ్ ను చేయనున్నారు చిత్ర యూనిట్.