చిన్న చిత్రంగా విడుదలైన బలగం అంతర్జాతీయ స్థాయిలో రెండు అవార్డులను కొల్లగొట్టి అందరిని అబ్బురపరిచింది. దాంతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా పేరు మారుమ్రోగిపోయింది. మరి బలగం సినిమా సాధించిన ఆ అవార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గత కొంత కాలంగా టాలీవుడ్ పై ఓ ముద్ర ఉండేది. ఆ ముద్ర ఏంటంటే? అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు తీయలేరని, అవార్డులు కొల్లగొట్టలేరని. అయితే ఈ అపవాదును తొలగిస్తూ.. దర్శకధీరుడు రాజమౌళి ఆస్కార్ అవార్డును కొల్లగొట్టి టాలీవుడ్ సత్తాను హాలీవుడ్ కు పరిచయం చేశాడు. అదీకాక వరల్డ్ వైడ్ గా ఎన్నో ప్రపంచ ప్రసిద్ది గాంచిన అవార్డును ఆర్ఆర్ఆర్ సినిమా కొల్లగొట్టింది. అభిమాలు ఈ సంతోషంలో మునిగి ఉండగానే మరో సినిమా అంతర్జాతీయ స్థాయిలో రెండు అవార్డులను సాధించింది. ఆ సినిమానే బలగం. బంధాలకు, బంధుత్వాలకు పెద్ద పీట వేస్తూ.. పిట్ట ముట్టుడు అనే కథాంశంతో ఈ బలగం తెరకెక్కింది. ఇక బలగం కొల్లగొట్టిన అవార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బలగం.. జబర్దస్త్ కమెడియన్ వేణు మెగా ఫోన్ పట్టి తెరకెక్కించిన సినిమా. చిన్న చిత్రంగా విడుదలై.. పెద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ చిత్రం. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపించింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది బలగం. రెండు అవార్డులను కైవసం చేసుకుని ప్రత్యేక ఘనతను సొంతం చేసుకుంది. సినిమా రంగంలో ప్రత్యేక అవార్డులుగా భావించే లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డుల్లో రెండు అవార్డులను సొంతం చేసుకుంది.
ఈ క్రమంలోనే బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి గాను డైరెక్టర్ వేణు, ఇక బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగానికి గాను ఆచార్య వేణు ఈ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. చిత్ర బృందం ట్వీట్ చేసుకొచ్చింది. దాంతో పలువురు సినీ ప్రముఖులు బలగం టీమ్ కు అభినందనలు తెలుపుతున్నారు. మరి బలగం సినిమాకు అంతర్జాతీయ అవార్డులు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
So here is some great news from #TeamBalagam
Inka, #Balagam ki awardlu occhudu shuru annattey…
Two awards at the Los Angels Cinematography Awards #LACA
Best cinematography – @dopvenu
Best Feature Film – @VenuYeldandi9Thank you all for rooting and hooting for US❤️ pic.twitter.com/ALCq8lOoaF
— Sailu Priyadarshi #Balagam (@priyadarshi_i) March 30, 2023