సినిమా ఇండస్ట్రీలో మూవీ రిలీజ్ కు ముందు గానీ, విడుదల తర్వాత గానీ కథలు కాపీ కొట్టారు అంటూ వివాదాలు జరిగిన సందర్భాలు పరిశ్రమలో కోకొల్లలు. అయితే సినిమా రిలీజ్ రోజే కాపీ ట్రోల్స్ ను ఎదుర్కొన్న సంఘటనలు మాత్రం ఇండస్ట్రీలో అరుదనే చెప్పాలి. తాజాగా బలగం సినిమా కూాడ రిలీజ్ రోజే కాపీ ట్రోల్స్ ఎదుర్కొంటోంది.
బలగం.. జబర్దస్త్ వేణు దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించిన అచ్చమైన తెలంగాణ పల్లెటూరి చిత్రం. మార్చి 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఒకరోజు ముందే ప్రివ్యూ షోలు చూసిన వారందరు సినిమా బాగుందని, కచ్చితంగా హిట్ అవుతుందని చెప్పుకొచ్చారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే రిలీజ్ రోజే బలగం కథ నాదే.. కాపీ కొట్టారు అంటూ జర్నలిస్ట్ గడ్డం సతీష్ అనే వ్యక్తి ఆరోపించారు. దాంతో అసలు బలగం కథ ఎవరిది? అన్న ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సినిమా ఇండస్ట్రీలో మూవీ రిలీజ్ కు ముందు గానీ, విడుదల తర్వాత గానీ కథలు కాపీ కొట్టారు అంటూ వివాదాలు జరిగిన సందర్భాలు పరిశ్రమలో కోకొల్లలు. అయితే సినిమా రిలీజ్ రోజే కాపీ ట్రోల్స్ ను ఎదుర్కొన్న సంఘటనలు మాత్రం ఇండస్ట్రీలో అరుదనే చెప్పాలి. అయితే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సంస్థల్లో భాగమైన దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థ తాజాగా నిర్మించిన చిత్రం బలగం. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు జబర్దస్త్ కమెడియన్ వేణు. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం విడుదల రోజే వివాదంలో చిక్కుకుంది. ఆ వివాదం ఏంటంటే? బలగం కథ నాదే కాపీ కొట్టారు అంటూ జర్నలిస్ట్ గడ్డం సతీష్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ తో సతీష్ ఈ విధంగా మాట్లాడారు.”2011లోనే పచ్చికి కథను రాశాను. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ యాస నిరాధారణకు గురికావడంతో.. ఈ కథ ప్రచూరణకు నోచుకోలేదు. దాంతో అప్పటి నుంచి నేను తెలంగాణ యాసలోనే కథలు రాయాలని అనుకున్నాను. ఇక 2014లో ప్రముఖ పత్రిక నమస్తే తెలంగాణలోని బతుకమ్మ మ్యాగజైన్ లో అచ్చు వేశారు. ఈ కథ ఏంటంటే? మనిషి మరణించిన తర్వాత 3వ రోజు, 5వ రోజు, 11వ రోజు ఇలా పచ్చికీ అంటే పక్షికి ముద్దలు పెడతారు. అవి కాకులు తింటే ఆత్మ సంతోషంగా ఉంటుంది అన్నది తరతరాల నుంచి వస్తున్న నమ్మకం. దీని ఆధారంగానే నేను ఈ కథను రాసుకున్నాను. బలగం సినిమాను చూసే మాట్లాడుతున్నాను. ఇందులో 90 శాతం కథ నాదే.. ఓ 10 శాతం మాత్రమే మార్చారు” అంటూ చెప్పుకొచ్చారు.
అయితే సినిమా చూసేటప్పుడు వేణును కలిశానని, అప్పుడేం మాట్లాడలేదు అని సతీష్ చెప్పుకొచ్చారు. కథకు సంబంధించిన క్రెడిట్ నాకు ఇవ్వాలని, దానికి దిల్ రాజు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సతీష్ కోరారు. దిల్ రాజు ఈ విషయంపై స్పందించక పోతే.. నేను చట్టపరంగా ముందుకు వెళ్లాల్సి వస్తుందని జర్నలిస్ట్ గడ్డం సతీస్ పేర్కొన్నాడు. ఇక ప్రివ్యూ షోల నుంచే బలగం మూవీపై మంచి బజ్ ను క్రియేట్ చేశారు మూవీ టీమ్. ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ తో మరింత బజ్ పెరిగింది బలగం సినిమాపై. మరి రిలీజ్ రోజే బలగం కథ కాపీ ట్రోల్స్ ను ఎదుర్కొవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.