టాలీవుడ్ లవ్ స్టోరీస్‌లో కల్ట్ సినిమాలొచ్చి చాలా రోజులైంది. ‘బేబి’ మూవీ ఆ లోటు తీర్చేసింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ మెయిన్ లీడ్స్‌గా, సాయి రాజేష్ దర్శకత్వంలో, ఎస్‌కెఎన్ నిర్మించిన యూత్‌ఫుల్ ఈ ఎంటర్‌టైనర్ కలెక్షన్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.
టాలీవుడ్ లవ్ స్టోరీస్‌లో కల్ట్ సినిమాలొచ్చి చాలా రోజులైంది. ‘బేబి’ మూవీ ఆ లోటు తీర్చేసింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ మెయిన్ లీడ్స్‌గా, సాయి రాజేష్ దర్శకత్వంలో, ఎస్‌కెఎన్ నిర్మించిన యూత్‌ఫుల్ ఈ ఎంటర్‌టైనర్ కలెక్షన్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా సక్సెస్ సెలబ్రేషన్స్ చేశారంటే సినిమా రేంజ్ ఏంటనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా హీరో క్యారెక్టర్‌తో యూత్ పోరగాళ్లంతా కనెక్ట్ అయ్యారు. జెన్యూన్‌గా లవ్ చేసి, ప్రేమ కోసం పిచ్చోడిలా తయారయ్యే పాత్ర కుర్రాళ్లకు బాగా నచ్చేసింది. ఇక వైష్ణవి చైతన్య రోల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా చూసిన వాళ్లు తిట్టుకునేంతగా ఆమె పాత్ర ఎంతగానో ఓన్ చేసుకుంది.
రియల్ లైఫ్‌లో జరిగిన, జరుగుతున్న సంఘటనల ఆధారంగా తెరకెక్కింది ఈ సినిమా. అలాంటప్పుడు ఆ పాత్ర కూడా రియలిస్టిక్‌గానే ఉండాలి. ఇందులో వైష్ణవి కూడా నేచురల్‌గానే నటించింది. ఒక అమ్మాయి ప్రేమించిన వారిని మోసం చేస్తే ఎలా ఉంటుందో.. ‘బేబి’ సినిమాలో వైష్ణవిని చూస్తే తెలుస్తుంది. నిజానికి సినిమా కల్ట్ అంటున్నారు గానీ వైష్ణవి చేసిన పాత్రను కూడా కల్ట్ అనే అనాలి. రీసెంట్‌గా ఓ కుర్రాడు వైష్ణవి పేరుని తన చేతి మీద టాటూ వేసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్లకి అతనెవరో కొంత వరకు తెలుసు కానీ బయట జనాలకి పెద్దగా తెలియదు. ఆ కుర్రాడు వైష్ణవి చైతన్య తమ్ముడు నితీష్. అక్క మీద అభిమానంతో ఆమె పేరుని తన చేతిపై టాటూ వేయించుకున్నాడు. అక్కను ఆప్యాయంగా ముద్దాడుతున్న పిక్స్, టాటూ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.
వైష్ణవి తమ్ముడిపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సీరియస్..
‘బేబి’ సక్సెస్ తర్వాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఆనంద్, వైష్ణవి ఫోటోలు తీసుకున్నారు. వాళ్లతో వైష్ణవి తమ్ముడు నితీష్ కూడా ఉన్నాడు. అయితే విజయ్‌లానే నితీష్ కూడా విజయ్ నడుం మీద చేయి వేశాడు. ‘విజయ్ ఏమైనా నార్మల్ పర్సన్ అనుకున్నావా? విజయ్ మీద చెయ్యి వేయడం ఏంటి? ఇలాంటి ఆటిట్యూడ్ తగ్గించుకో.. పెద్ద వాళ్లతో ఎలా ప్రవర్తించాలో వైష్ణవి అయినా తమ్ముడికి చెప్పాలి కదా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : ఓటీటీలో ‘రుద్రంగి’.. మూడు వారాలకే స్ట్రీమింగ్.. ఎక్కడంటే