సినిమాలకు సంబంధించిన మేకింగ్ సీన్స్.. బిహైండ్ ది సీన్స్ ని యూట్యూబ్ లో విడుదల చేయడం అనేది మామూలే. విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా తమ సినిమాల్లో అద్భుతాన్ని ఎలా సృష్టించారో ప్రతీది క్లియర్ గా చూపిస్తున్నారు. ఆ మధ్య ఆర్ఆర్ఆర్ సినిమాలో పులితో ఎన్టీఆర్ ఫైట్ సీన్ ని కూడా ఎలా తీశారో మేకింగ్ సీన్స్ లో చూపించారు. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ అనేది చిన్న సినిమాలో కూడా ఉంటున్నాయి. ఇక అవతార్ సినిమాకైతే విజువల్ ఎఫెక్ట్ లే కీలకం. అవతార్ అదొక అద్భుతమైన లోకం. మనల్ని మనకి తెలియకుండానే ఒక అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతుంది. అవతార్ సినిమా ఎంత పెద్ద సంచలనాన్ని సృష్టించిందో.. ఇప్పుడు ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ సినిమా కూడా అంతకు మించి సంచలనాలను సృష్టిస్తోంది.
ఆ క్రెడిట్ మొత్తం అవతార్ సృష్టికర్త జేమ్స్ కామెరూన్ దే. జేమ్స్ కామెరూన్.. మ్యాన్ ఆఫ్ విజువల్ వండర్.. మ్యాన్ ఆఫ్ మాస్టర్ పీస్ మూవీస్.. మ్యాన్ ఆఫ్ రికార్డ్స్. ఒక అందమైన కలని తెర మీద అద్భుతంగా ఆవిష్కరించగల సినీ బ్రహ్మ జేమ్స్ కామెరూన్. అలాంటి సినీ బ్రహ్మ మేధస్సు నుంచి ఉద్భవించిన అద్భుతం “అవతార్’. అవతార్ సినిమా ఒక విజువల్ వండర్. అలాంటి విజువల్ వండర్ ని ఎలా రూపొందించారో అనేది మేకింగ్ సీన్స్ లో చూపించారు మేకర్స్. అవతార్ బిహైండ్ ది సీన్స్ పేరిట ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అవతార్ సినిమాలో కనిపించే పాత్రలను.. ఎలా చిత్రీకరించారో కనబడుతోంది.
సినిమాలో సన్నివేశాలు అంత అద్భుతంగా కనబడడం వెనుక ఇంత కష్టం ఉంటుందా? సినిమాలో కనిపించే అందమైన అద్భుతం వెనుక ఇంత శ్రమ ఉంటుందా? అని అనిపిస్తుంది. ఈ మేకింగ్ సీన్స్ చూస్తే వావ్.. అద్భుతం అని అనకుండా ఉండలేరు. అంతలా ఆకట్టుకుంటున్నాయి. అవతార్, అవతార్: ది వే ఆఫ్ వాటర్ సినిమాలు చూసే ఉంటారు. ఈ సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ మిమ్మల్ని కట్టి పడేసి ఉంటాయి. ఆ కట్టిపడేసే విజువల్ ఎఫెక్ట్స్ వెనుక ఉన్న ఈ మేకింగ్ సీన్స్ చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.