కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరిగా నటించి జేమ్స్ చిత్రం మార్చి 17న థియేటర్ల విడుదలై సందడి చేస్తోంది. కర్ణాటక రాష్ట్రం మొత్తం వారం రోజుల పాటు కేవలం జేమ్స్ సినిమాని మాత్రమే ప్రదర్శించనున్నారు. కలెక్షన్ల పరంగా జేమ్స్ కర్ణాటకలో సరికొత్తి రికార్డులు సృష్టిస్తోంది. థియేటర్లలో తమ అభిమాన హీరో అప్పుని చివరిసారి చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. శివరాజ్ కుమార్ సైతం అభిమానులతో కలిసి ఫస్ట్ డే సినిమా చూస్తూ ఏడ్చేశారు. ఇప్పుడు కన్నడనాట కేవలం జేమ్స్ సినిమానే హాట్ టాపిక్. ఈ సినిమా విషయంలో పునీత్ భార్య అశ్విని భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఈ సినిమా చూడలేనని చెప్పారు.
ఇదీ చదవండి: పాపం ఆ నటికి ఎంత కష్టమొచ్చింది.. ఇష్టమైన కారును అమ్ముకుంది..!
ఓ ఇంటర్వూలో జేమ్స్ సినిమా గురించి ప్రస్తావించిన అశ్విని.. తాను అప్పు జేమ్స్ సినిమా అందరిలా చూడలేకపోవచ్చు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘జేమ్స్ సినిమా చూడటం నా వల్ల కాదు. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ గురించి పునీత్ నాతో చెప్పేవారు. సినిమా చాలా బాగా రూపుదిద్దుకుంది. జేమ్స్ సినిమాలో సరికొత్త టెక్నాలజీని ఉపయోగించారు. ఇండస్ట్రీలోని అన్ని రంగాల్లో కొత్తవారికి చోటు కల్పించేందుకు పునీత్ రాజ్ కుమార్ ప్రొడక్షన్ నుంచి మేం కృషి చేస్తాం. అదే పునీత్ ఆశయం కూడా. మేము గొప్ప చిత్రాలను తీయలేకపోవచ్చు. కానీ, మా స్థాయికి తగినట్లు మంచి చిత్రాలను అందిస్తాం’.
‘అప్పు మరణించిన సమయంలో ఆయన ఫ్యాన్స్ మాకు అండగా నిలిచారు. అప్పు జయంతి రోజు రక్తదాన శిబిరాలు, నేత్రదాన, అవయవదానంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించారు. అలాంటి కార్యక్రమాల ద్వారా అప్పూని బతికించారు’ అంటూ అశ్వినీ పునీత్ రాజ్ కుమార్ తెలియజేశారు. అశ్వినీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.