అషూరెడ్డి.. బుల్లితెరపై అందం, యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఆర్జీవీ శిష్యురాలుగా బాగా ఫేమస్ అయ్యింది. ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూ ఒకటి చేసి యూట్యూబ్ ని షేక్ చేసింది. ఆ తర్వాత చాలా ప్రశంసలు కూడా అందుకుంది. తన లైఫ్ అలా ఒక్కసారిగా మార్చేసిన ఆర్జీవీకి ట్రిబ్యూట్ ఇస్తూ.. అసలు ఆర్జీవీ అంటే ఆమెకు ఎందుకంత ఇష్టం, ప్రేమ అని చెప్పుకొచ్చింది. అందుకు 9 బోల్డ్ కారణాలు కూడా చెప్పింది.
రామ్ గోపాల్ వర్మను కలిశాక ఆమె కాన్ఫిడెన్స్ రెండింతలు అయ్యిందంట. అంతేకాదు ఆర్జీవీ మైండ్ అంటే చాలా ఇష్టం అంట. అది పర్వర్టెడ్ మైండ్ అని కూడా చెప్పింది. ఆయన సెక్స్ కావాలని అడిగే తీరు కూడా చాలా నచ్చుతుందంట. ఆయన కళ్లు, అతని థింకింగ్, మాటల్లో బోల్డ్ నెస్, ఆయన డాన్సు అంటే చాలా ఇష్టమంట. ఆర్జీవీ సెక్సువల్ లైఫ్ ను వివరించిన తర్వాత.. ఆ ఇష్టం, అభిమానం రెండింతలు అయ్యిందంట. ఇప్పుడు ఆ వీడియో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. మరి, అషూరెడ్డి చెప్పిన 9 కారణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
