డ్రగ్స్ కేసు వ్యవహారంలో అరెస్ట్ అయిన షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ జైలు నుంచి విడుదలయ్యాడు. గత కొన్ని రోజుల నుంచే జైల్లు ఉన్న అర్యన్ ఎట్టకేలకు జైలు చెర నుంచి బయటకు వచ్చాడు. ఇక డ్రగ్స్ కేసు విషయంలో బాంబే హైకోర్టు ఆర్యన్ కు గురువారమే బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే విడుదల ప్రక్రియలో కొన్ని కారణాలతో అర్యన్ విడుదల కా
కాస్త ఆలస్యమవ్వటంతో శుక్రవారం రాత్రి వరకు జైల్లో లోనే ఉండాల్సి వచ్చింది.
ఇక తనయుడు ఆర్యన్ ఖాన్ విడుదల అనంతరం తీసుకెళ్లేందుకు షారుఖ్ ఖాన్ ఆయన భార్య గౌరీ ఖాన్ జైలుకు చేరుకున్నారు. జైలు అధికారుల నుంచి పూర్తి ఉత్తర్వులు వెలువడటంతో ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్ ను విడుదల చేశారు. అయితే డ్రగ్స్ కేసు విషయంలో అక్టోబర్ 3న ఎన్సీబీ అధికారులు అర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.