అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షనల్ లో తెరకెక్కిన సినిమా పుష్ప. ప్రమోషన్ లో భాగంగా ఫుల్ బిజీగా ఉన్న మూవీ యూనిట్ విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమాలోని ‘ఉ అంటావా మావ.. ఉఊ అంటావా మావ’ అనే ఐటెమ్ సాంగ్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. విడుదల చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ తో యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ ఉర మాస్ ఐటెమ్ సాంగ్ కి ఇప్పుడు ప్రతీ ఒక్కరు డ్యాన్స్ చేస్తూ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసుకుంటున్నారు.
ఇక తాజాగా ఇదే దారిలోకి వెళ్లింది ఆర్జీవీ బ్యూటీ అరియానా గ్లోరీ. బుల్లితెరపై ఇటు యాంకర్ గా అటు సినిమాల్లో నటిగా నటిస్తూ అరియానా తెగ బిజీగా మారింది. అయితే ఈ బ్యూటీ పుష్పలో సినిమాలోని ‘ఉ అంటావా మావ.. ఉఊ అంటావా మావ’ అనే ఐటెమ్ సాంగ్ కి స్టేప్పులేస్తూ రచ్చ రచ్చ చేసింది. ఇదే డ్యాన్స్ వీడియోను తన ఇన్ స్ట్రా గ్రామ్ పోస్ట్ చేసింది. ఈ వీడియోను చూసిన ఆమె ఫ్యాన్స్ అరియానా రెచ్చిపోయిందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మాస్ ఐటెమ్ సాంగ్ కు స్టేప్పులేసిన అరియానా గ్లోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.