ఈమధ్య కాలంలో మూవీ షూటింగ్ సెట్‌లలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. అయితే అదృష్టం కొద్ది.. ఈ ప్రమాదాల్లో ఎవరు గాయపడటం వంటివి జరగడం లేదు. తాజాగా ఏఆర్ రెహమాన్ కుమారుడు షూటింగ్‌లో కూడా ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. ఆ వివరాలు..
సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా తన మ్యూజిక్‌తో భారతీయ ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. ఆస్కార్ గెలిచి.. ఆయన ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరించారు. ప్రస్తుతం రెహమాన్ చేతిలో పలు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇక ఆ సంగతి పక్కకు పెడితే.. రెహమాన్ కుమారుడు ఏఆర్ అమీన్ కూడా తండ్రి అడుగు జాడల్లోనే కంపోజర్, గాయకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. రాణిస్తున్నాడు. ప్రస్తుతం అమీన్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. అమీన్ ఓ సాంగ్ షూటింగ్‌లో పాల్గొనగా పెను ప్రమాదం సంభంవించింది అని పోస్ట్ చేశాడు. ఈ సంఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా.. ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేదని తెలిపాడు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. ఆ వివరాలు..
అమీన్ చేసిన పోస్ట్ ఇలా ఉంది. ‘‘మూడు రోజుల క్రితం నేను ఓ సాంగ్ షూట్ నిమిత్తం.. చెన్నైలో షూటింగ్‌లో పాల్గొన్నాను. ఆ సమయంలో నా దృష్టంతా.. కెమరా మీదనే ఉంది. నేను పని చేసుకుంటూ ఉండగా.. లైటింగ్ కోసం క్రేన్‌కు ఏర్పాటు చేసిన కొన్ని వస్తువులు.. భారీ లైట్లు పైనుంచి కింద పడ్డాయి. అయితే అదృష్టం కొద్ది ఈ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో నేను.. వాటికి కొద్ది దూరంలో ఉన్నాను. పైగా కిందకు పడ్డ వాటిలో ఓ భారీ షాండిలియర్ కూడా ఉంది. ఇది చూసి నేను తీవ్ర షాక్‌కు గురయ్యాను’’ అని తెలిపాడు.
‘‘అదృష్టం ఏంటంటే.. ఈ ఘటనలో నాతో సహా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ నేను కొన్ని అంగుళాల దూరంలో ఉండి ఉంటే.. అంత పెద్ద భారీ షాండిలియర్ నా మీదే పడేది కదా అన్న ఊహే నన్ను భయపెడుతుంది. ఈ ప్రమాదం జరిగి.. మూడు రోజులు అవుతుంది. కానీ నేను ఇప్పటికి ఇంకా ఆ షాక్ నుంచి బయటకు రాలేకపోతున్నాను’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు అమీన్. ప్రసుత్తం ఇది వైరవుతోంది. ఎలాంటి ప్రమాదం జరగకుండా అమీన్ బయటపడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అతడు త్వరగా ఆ షాక్ నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు.
ఈ విషయంపై ఏఆర్ రెహమాన్ కూడా స్పందించారు. అలాగే భద్రతా ప్రమాణాల గురించి ఆయన ప్రశ్నించారు. ‘‘కొన్ని రోజుల క్రితం నా కుమారుడు ఏఆర్ అమీన్, అతడి బృందం.. తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు భగవంతుడి దయ వల్ల నా కుమారుడితో సహా మిగతా ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదు. మన సినీ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నప్పుడు.. భారతీయ సినిమాలకు వాడే సెట్‌లు, లోకేషన్లు ప్రపంచ స్థాయి భద్రతా ప్రమాణాలను కలిగి ఉండాలి. ఈ ప్రమాదం గురించి తెలిసి మేమంతా ఎంతో కంగారు పడ్డాము. ఈ సంఘటనపై దర్యాప్తు ఫలితాల కోసం చూస్తున్నాం’’ అని పోస్ట్ చేశారు రెహమాన్.
ఇక అమీన్ తమిళ చిత్రం ఓ కాదల్ కెఎన్‌మణి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో పాటలు పాడారు. ఇక అమీన్‌కు చిన్నప్పటి నుంచే సంగీతం అంటే ఎంతో మక్కువ. బాల్యం నుంచే తండ్రితో కలిసి.. అనేక స్టేజీ షోలలో పాల్గొన్నారు. అయితే ఇండస్ట్రీలోకి రావాలని ఆయన ఎన్నడు అనుకోలేదట. కానీ ఓ సారి ఆయన పాడిన పాటకు వచ్చిన ప్రశంసలు చూశాక.. ఇండస్ట్రీలో రాణించడం కోసం సంగీతంపై దృష్టి పెట్టాడు. అమీన్.. ఓకే బంగారం, నిర్మలా కాన్వెంట్, రోబో 2.0 సినిమాల్లో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.