రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు వివాదాలు కొత్తకాదు.. వివాదాలకు ఇతడు కొత్తకాదు. తాజాగా గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, రామ్ గోపాల్ వర్మకు అభినందనలు తెలిపాడు.
టాలీవుడ్ లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరు అంటే వెంటనే ఆర్జీవీ అనే సమాధానం వస్తుంది. అయితే వివాదాల దగ్గరకు ఆర్జీవీ వెళ్తాడో లేక ఆర్జీవీ వెళ్లాకే వివాదం చెలరేగుతుందో తెలీదు. తాజాగా గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. ఈ వ్యాఖ్యలపై విద్యార్థి సంఘాలతో పాటు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, రామ్ గోపాల్ వర్మకు అభినందనలు తెలిపాడు. అదేంటి? అందరు ఆర్జీవీని విమర్శిస్తూ.. తిడుతుంటే రెహమాన్ అభినందనలు ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారా? అయితే పదండి తెలుసుకుందాం.
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు వివాదాలు కొత్తకాదు.. వివాదాలకు ఇతడు కొత్తకాదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తూ.. ఫ్రీ పబ్లిసిటీ కొట్టేస్తుంటాడు ఈ ఆర్జీవీ. తాజాగా గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో దుమారం రేగుతోంది. యూనివర్సిటీలో జరిగిన అకడమిక్ ఎగ్జిబిషన్ 2023 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్మ మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడని టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత, వర్మపై యూజీసీకి, జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలతో అందరు ఆర్జీవీపై గుర్రుగా ఉంటే ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మాత్రం అతడికి అభినందనలు తెలిపాడు. రెహమాన్ అతడికి శుభాకాంక్షలు ఎందుకు చెప్పాడు అంటే?
1985లో విజయవాడలోని వీఆర్ సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదివాడు వర్మ. 37 సంవత్సరాల తర్వాత యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టాను పొందాడు. దాంతో తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు ఆర్జీవీ. “నేను పాసైన 37 సంవత్సరాలకు బీటెక్ పట్టాను పొందాను. దాంతో నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక సివిల్ ఇంజినీరింగ్ లో కొనసాగడం నచ్చక 1985లో నేను ఈ పట్టాను తీసుకోలేదు. థాంక్యూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ.. ఉమ్మా…” అని రాసుకొచ్చాడు ఆర్జీవీ. దాంతో వర్మకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు అభిమానులు. అయితే వర్మకు అభినందనలు తెలిపిన వారిలో ప్రముఖ దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఉన్నారు. “కంగ్రాంట్స్ రాము గారు” అని ఏఆర్ రెహమాన్ ట్వీట్ చేశాడు. దానికి వర్మ స్పందిస్తూ.. సర్ థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చాడు.
Sirrrrrrrrr thyaaaaaanksssss😌😌😌 https://t.co/z2YOJ750Hg
— Ram Gopal Varma (@RGVzoomin) March 16, 2023