టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కొత్త సినిమా ఘాటీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకుని సెప్టెంబర్ 5న పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆకట్టుకునే ప్రోమోలు, భారీ యాక్షన్ దృశ్యాలతో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన అనుష్క శెట్టి తాజా చిత్రం ఘాటీ ఇప్పుుడు విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో ధియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో అనుష్క శెట్టి విక్రమ్ ప్రభుతో కలిసి నటించింది. యాక్షన్, ఎమోషన్ కలిసిన క్రిష్ సినిమా కావడం ఒక వైపు, చాలాకాలం తరువాత కమ్‌బ్యాక్ ఇస్తున్న అనుష్క సినిమా కావడం మరోవైపు సినిమా అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమా ఇప్పుడు సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది.
ఇప్పటికే ఫుల్ బజ్ క్రియేట్ చేసుకున్న ఘాటీ సినిమా ఇప్పటికే వివిధ కారణాలతో రిలీజ్ వాయిదా పడింది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో అనుష్క శెట్టి శీలావతి పాత్రలో అలరించనుంది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 37 నిమిషాలకు సెట్ చేశారు నిర్మాతలు.
సాగర్ నాగవెల్లి ఈ సినిమాకు సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్ నిర్మించింది. గంజాయి సరఫా చేసే పాత్రలో అనుష్క ఇరగదీసిందంటున్నారు. ఇక ట్రైలర్‌లో విన్పించిన సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఎట్టుంటాదో చూద్దూగానీ అనే డైలాగ్ ఇప్పటికే వైరల్ అవుతోంది. ఇందులో ఉన్న ఏడు భారీ యాక్షన్ దృశ్యాలు సినిమాకు హైలైట్ అంటున్నారు. పూర్తిగా క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంటుందనే టాక్ విన్పిస్తోంది.