“మిర్చి”.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటికీ మరచిపోలేని చిత్రం ఇది. 2013లో విడుదలైన ఈ మూవీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మన అందరికి తెలిసిందే. ఈ చిత్రం అప్పటివరకు ఉన్న ప్రభాస్ సినిమాల్లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది. దర్శకుడు కొరటాల శివకు ఇదే మొదటి సినిమా కాగా.., తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక ఇందులో ప్రభాస్ కి జోడీగా అనుష్క, రిచా గంగోపాధ్యాయ నటించారు. ఇక మిర్చి మూవీ రిలీజ్ అయ్యి.. 10 ఏళ్ళు పూర్తి అయినా.. ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్-అనుష్క మధ్య జరిగిన ఓ సంఘటనని మాత్రం ఫ్యాన్స్ ఇప్పటికీ మరువలేకపోతున్నారు.
మిర్చి సినిమాలో ప్రభాస్ మరియు అనుష్క జంట ఏ విధంగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ జోడి ఎక్కడ కనిపించినా ప్రభాస్ అభిమానులకు పండగే. ఎందుకంటే అంత ముచ్చటగొలిపేలా ఉంటుంది ఈ జంట. బిల్లా సినిమాతో తొలిసారి జతకట్టిన ఈ జోడి.. మిర్చి సినిమాతో మరొకసారి సిల్వర్ స్క్రీన్ పై మెరిశారు. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ఎంతలా వర్కౌట్ అయిందో మనకు తెలిసిన విషయమే. అందులో ఒక సన్నివేశం ఇప్పటికీ కొద్దిపాటి షాక్ కి గురి చేసేలా ఉంటుంది. “పండగలా దిగివచ్చావు” అనే సాంగ్ లో అనుష్క ప్రభాస్ ని పైకి ఎత్తుకుంటుంది. అనుష్క కూడా హైట్ ఉన్నపటికీ.. ప్రభాస్ అంతకు మించి ఉంటాడు. ప్రభాస్ లాంటి ఒక కటౌట్ ని మోయాలంటే అది చాల కష్టమైనా విషయం.
ఇక ఆ విషయంలో అనుష్క ప్రభాస్ ని ఎలా ఎత్తుకోగలిగింది అని సగటు ప్రేక్షకుడికి ఒక ఆలోచనైతే ఉంటుంది. కానీ.., అసలు విషయం ఏమిటంటే ప్రభాస్ ని అనుష్క డైరెక్ట్ గా మోయలేదంట!.. ఒక స్టూల్ సహాయంతో ప్రభాస్ ని ఎత్తగలిగింది. ఇదే విషయాన్నీ అనుష్క ఒక ఇంటర్వ్యూలో వివరించింది.ఈ సన్నివేశం సినిమాకి చాలా హైలైట్ గా నిలిచింది. ఏదేమైనా ఒక హీరోయిన్.. హీరోని మోయడమంటే అది చాల అరుదుగా జరిగే విషయం. అలా.. అనుష్క ఆరోజు సెట్ లో ప్రభాస్ ని అవలీలగా ఎత్తడంతో చిత్ర యూనిట్ అంతా షాక్ కి గురి అయ్యారట. అప్పట్లోనే ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది.
ఇక ప్రభాస్-అనుష్క..మిర్చి తర్వాత బాహుబలి సిరీస్ లో నటించి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ అవ్వగా, అనుష్క మాత్రం కొన్ని ప్రయోగాత్మక చిత్రాలలో నటించి మెప్పించింది. అయితే.. ఈ మధ్య కాలంలో మాత్రం స్వీటీ నుండి ఎలాంటి చిత్రం రాలేదు. తాజాగా జాతిరత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క ప్రధాన పాత్రలతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఏదేమైనప్పటికీ ప్రభాస్-అనుష్కల జంట ఎప్పుడు తెర మీద కనిపించిన ఫ్యాన్స్ కి కన్నుల పండుగలా ఉంటుంది. అందుకే మరొక్కసారి వీరిద్దరి కలయికలో సినిమాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి అనుష్క-ప్రభాస్ ల జోడీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.