తెలుగులో హాట్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది విష్ణుప్రియ భీమినేని. కొన్నాళ్ల క్రితం వరకు బుల్లితెర మీద పలు షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. చేతి నిండా ప్రాజెక్ట్‌తో ఫుల్ బిజీగా ఉన్నప్పటికి.. సోషల్ మీడియాలోకూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది విష్ణుప్రియ. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటో షూట్స్, రీల్స్, వీడియోస్ పోస్ట్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంటుంది. ఇక కొన్ని రోజుల క్రితం బిగ్‌బాస్ ఫేమ్ మానస్‌తో కలిసి చేసిన ప్రైవేట్ ఆల్బమ్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రసుత్తం వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో నటిస్తూ.. ఫుల్ బిజీగా ఉంది విష్ణుప్రియ. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది విష్ణుప్రియ. ఆమె ఫేస్బుక్ పోస్టులు చూసిన వారు షాక్‌కు గురయ్యారు. ఇదేంటి విష్ణుప్రియకు ఏమైంది అని అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు ఇంతకు ఏం జరిగింది అంటే..
విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటుందో అందరికి తెలుసు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి విష్ణుప్రియ ఫేస్బుక్ అకౌంట్ స్టోరీలో చాలా అసభ్యకరమైన ఫోటోలు పోస్ట్ అయ్యాయి. ఒంటి మీద నూలు పోగు లేకుండా.. నగ్నంగా ఉన్న మహిళల ఫోటోలను చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఫోటోలతో పాటు కొన్ని అశ్లీల వీడియోలు కూడా దర్శనం ఇచ్చాయి. ఇదేంటి.. విష్ణుప్రియ ఫేస్బుక్లో ఇలాంటి పోస్టులు కనిపించడం ఏంటని నెటిజనులు ఆశ్యర్యపోయారు. ఆ తర్వాత ఆరా తీయగా అసలు విషయం తెలిసింది.
ఇంతకు విషయం ఏంటంటే.. విష్ణుప్రియ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. దుండగులు కొందరు ఆమె ఫేస్‌బుక్‌ని హ్యాక్ చేసి ఇలా అశ్లీల ఫోటోలు, అభ్యంతరకరమైన వీడియోలు పోస్ట్ చేశారు. ఈ విషయం కాస్త విష్ణుప్రియకు తెలియడంతో.. ఆమె వెంటనే అప్రమత్తమయ్యింది. తన అకౌంట్ హ్యాక్ అయిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ”విష్ణుప్రియభీమనేని ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయ్యింది. దయచేసి ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేయండి. ఆ పేజిని అన్ ఫాలో అవ్వండి” అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది విష్ణుప్రియ.
ఇక విష్ణు ప్రియకు ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. సుమారు 11 లక్షల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. అటు ఫేస్బుక్లో ఆమెకు భారీగానే ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో ఫేస్బుక్ హ్యాక్ అవ్వడంతో ఈ విషయాన్ని ఫేస్బుక్ టీమ్‌కు తెలియజేసింది విష్ణుప్రియ. ఇక ఇండస్ట్రీలో విష్ణుప్రియ ప్రయాణం షార్ట్ ఫిలిమ్స్‌తో ప్రారంభం అయ్యింది. యూట్యూబ్‌లో పలు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించడం ద్వారా గుర్తింపు తెచ్చుకుని.. టీవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘పోరా పోవే’ కార్యక్రమంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో కొన్ని ఎపిసోడ్స్‌లో, ‘జబర్దస్త్’లో కొన్ని స్కిట్స్‌లో కనిపించారు.