కొన్నిసార్లు హీరోయిన్లను మించిన గ్లామర్ షో చేసేస్తుంటారు బుల్లితెర భామలు. ఇదివరకు గ్లామర్ గురించి మాట్లాడితే.. సినీ హీరోయిన్ల పేర్లు మాత్రమే చర్చల్లోకి వచ్చేవి. కానీ.. కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో ట్రెండ్ మారిపోయింది. గ్లామర్ విషయంలో హీరోయిన్స్ సంగతి ఎలా ఉన్నా.. టీవీ యాంకర్స్ మాత్రం ఓ రేంజిలో రచ్చ చేస్తున్నారు. అవును.. అప్పుడప్పుడు అందాల ఆరబోతలో హీరోయిన్స్ ని మించిపోయారని కూడా అనిపిస్తుంటారు. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నవాళ్లు ఎందుకని ఒక్కసారిగా గ్లామర్ వైపు అడుగులేస్తున్నారు? అనంటే.. సోషల్ మీడియా ట్రెండ్ కూడా అందుకు ఓ కారణమనే చెప్పాలి.
సోషల్ మీడియా వచ్చాక.. క్రేజ్ అనేది సోషల్ మీడియాతోనే సాధ్యమని తెలిశాక.. గ్లామర్ ఫీల్డ్ లో అడుగేయడమే కాకుండా లైఫ్ లో కూడా ఎన్నో చేంజెస్ చేస్తున్నారు సెలబ్రిటీలు. ఈ మధ్యకాలంలో అందాల షోలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు యాంకర్ శ్రీముఖి. ఏమాత్రం మొహమాటం లేకుండా టాప్ టు బాటమ్ అందాల ప్రదర్శనతో సర్ప్రైజ్ చేస్తోంది ఈ బ్యూటీ. ఎల్లప్పుడూ ఎనర్జిటిక్ గా షోలను హోస్ట్ చేసే శ్రీముఖి.. స్కిన్ షోలో హద్దులు చెరిపేసింది. కొంతకాలంగా తన యాంకరింగ్ తోనే కాకుండా అందాలతో కూడా టీవీ షోలను సక్సెస్ చేస్తోంది.. అలాగే సోషల్ మీడియాని కూడా రేంజ్ లో హీటెక్కిస్తోంది.
గతంలో శ్రీముఖి చాలా బొద్దుగా ఉండేది. కానీ.. కొన్నాళ్ళు కష్టపడి మొత్తానికి నాజూకుగా మారిపోయింది. ఓవైపు టీవీ షోస్ చేస్తూనే.. మరోవైపు అడపాదడపా సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తోంది. మధ్యలో హీరోయిన్ గా కూడా పలు సినిమాలు చేసింది. కెరీర్ యాంకర్ గా వెలుగులోకి వచ్చినప్పటికీ, బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా సూపర్ క్రేజ్ సొంతం చేసుకొని.. బుల్లితెర ఆడియెన్స్ కి మరింత దగ్గరైంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తుంటుంది. మొన్నటివరకూ ఎద పరువాలతో ఊరించిన శ్రీముఖి.. ఈ మధ్య థైస్ అందాలతో షేక్ చేస్తోంది. ప్రస్తుతం శ్రీముఖి పోస్ట్ చేసిన లేటెస్ట్ గ్లామరస్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి శ్రీముఖి గ్లామర్ షో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.