తెలుగు యాంకర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది సుమనే. ఇక మేల్ యాంకర్స్ లో ప్రదీప్ చాలా అంటే చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. వీరిద్దరి తర్వాత బాగా పేరు తెచ్చుకున్న యాంకర్ అంటే శ్రీముఖినే. ఆ ఛానెల్ ఈ ఛానెల్ అనే తేడా లేకుండా అన్నిచోట్లు షోలు, ఈవెంట్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అదే టైంలో ఫ్యామిలీకి కూడా టైమ్ కేటాయిస్తూ ఉంటుంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. అలా తాజాగా తన తమ్ముడు బర్త్ డేని సెలబ్రేట్ చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. శ్రీముఖి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఆమె వాయిసే. ఎందుకంటే శ్రీముఖి అరించిందంటే మొత్తం షోనే దద్దరిల్లిపోతుంది. దీని గురించి ఆమెపై కామెంట్స్ చేసినా సరే సరదాగా తీసుకుంటుంది తప్పింది పెద్దగా పట్టించుకోదు. ఇక ‘బిగ్ బాస్’ షోలో శ్రీముఖి ఆడినప్పుడు, ఆ టైంలో ఈమె ఫ్యామిలీ అంతా కూడా ఓ ఎపిసోడ్ సందర్భంగా వచ్చారు. అలా శ్రీముఖి తమ్ముడు శుశ్రుత్ కూడా కూడా కొంత ఫేమ్ తెచ్చుకున్నాడు. ఎప్పటికప్పుడు శ్రీముఖి పోస్ట్ చేసే వీడియోలు, వ్లాగ్స్ లోనూ కనిపిస్తూ ఉంటాడు. ఇక తాజాగా సోమవారం అతడి బర్త్ డే జరిగింది.
తమ్ముడి పుట్టినరోజుని ఇంట్లోనే సెలబ్రేట్ చేసిన శ్రీముఖి.. తెగ సందడి చేసింది. అందుకు సంబంధించిన ఫొటోల్ని కూడా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఐ లవ్యూ మోస్ట్ అని చెబుతూ శుశ్రుత్ కి తెగ ముద్దులు పెట్టేసింది. ఇక ఇదే పోస్ట్ పై జబర్దస్త్ అవినాష్, నటుడు సాయికిరణ్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. శుశ్రుత్ కి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇదిలా ఉండగా యాంకర్ గా చేస్తున్న శ్రీముఖి.. చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘భోళా శంకర్’ మూవీలోనూ నటిస్తోంది. ఈ విషయం చాలారోజుల క్రితమే చెప్పింది. సరే ఇదంతా పక్కనబెడితే.. శ్రీముఖి తమ్ముడి బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోస్ మీకెలా అనిపించాయి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.