యాంకర్ రష్మీ.. సినిమా ప్రమోషన్లకు రాదు.. కనీసం ఫోన్ కూడా ఎత్తదు.. అని సింగర్ గీతామాధురి భర్త నందు తాజాగా రష్మీపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత అది ఫ్రాంక్ వీడియో అంటూ నందు చెప్పాడు. ఇక ఈ వివాదంపై తాజాగా రష్మీ మండిపడింది. అసలు ఫ్రాంక్ వీడియోలు చేయడం ఏంటి? వదిలేస్తే నా వాష్ రూమ్ లో కూడా కెమెరాలు పెట్టేలా ఉన్నారంటూ తీవ్ర స్థాయిలో మాటలతో విరుచుకుపడింది. దాంతో ఈ వివాదం మరింత ముదిరినట్టుగా తెలుస్తోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
యాంకర్ రష్మీ.. బుల్లితెరపై ప్రేక్షకుల కలల రాకుమారిగా వెలుగొందుతోంది. జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా చేస్తున్న రష్మీ.. అటు వెండితెరపై కూడా అప్పుడప్పుడు సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు నటించిన ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే మూవీలో నందుకు జోడిగా నటించింది. ఈ సినిమా షూటింగ్ జరిగి చాలా కాలం అయ్యింది. అన్ని కష్టాలను దాటుకుని నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో యూనిట్ ప్రమోషన్లు ప్రారంభించారు. ఈ క్రమంలోనే నందు రష్మీపై కామెంట్స్ చేసిన విషయం మనకు తెలిసిందే. తాజాగా తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పింది రష్మీ. ఈ వివాదం పై స్పందిస్తూ..”నందు చేసింది ప్రాంక్ వీడియోనే కావొచ్చు కానీ నేను మాట్లాడిన మాటల మాత్రం అబద్దం కావు. సడెన్ గా ప్రమోషన్స్ కు రమ్మంటే ఎలా వస్తారంటూ.. రష్మీ ప్రశ్నించింది.
ఈ విషయంపై మరింతగా రష్మీ స్పందిస్తూ.. “నేను అప్పటికే కమిట్ అయిన సినిమాలు, నా షెడ్యూల్ చూసుకోవాలి కదా? ఇవన్నీ వారికి తెలియకుండా.. షూటింగ్ లో ఉన్నప్పుడు వచ్చి విసిగించారు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. చాన్స్ ఇస్తే నా వాష్ రూమ్ లో కూడా కెమెరాలు పెట్టేలా ఉన్నరంటూ తీవ్రంగా మాట్లాడింది. ప్రమోషన్స్ కు ఎందుకు రావు అని నందు అడిగితే.. అక్కడ నాకు రకరకాల ప్రశ్నలు ఎదురైతాయి. వాటికి నేను సమాధానాలు చెప్పలేను అందుకే నేను ప్రమోషన్స్ కు రాను” అంటూ ఆ ప్రాంక్ వీడియో లో రష్మీ చెప్పింది. ఈ వీడియోని నందు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం రష్మీ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే లేపేలా ఉన్నాయంటున్నారు పరిశ్రమలోని పెద్దలు. మరి రష్మీ కౌంటర్ కు నందు ఎలా రియాక్ట్ అవుతాడో.. సినిమా యూనిట్ ఏవింధంగా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.