బుల్లితెర స్టార్ యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మీ.. ఇటు టీవీ షోలతో పాటు సినిమాలను కూడా బ్యాలెన్సింగ్ గా చేసుకుంటూ వెళ్తోంది. తనకు సంబంధించి ఏ విషయమైనా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేస్తుంటుంది. ఇవన్నీ పక్కన పెడితే.. యాంకర్ రష్మీ జంతు ప్రేమికురాలు అనే సంగతి తెలిసిందే. ఎక్కడ ఏ జంతువుని హింసించినట్లు తెలిసినా, కనిపించినా తనవైపు నుండి రియాక్ట్ అవుతుంటుంది. అలాగే మూగజీవాలను హింసించే వారిపై రష్మీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఫైర్ అవ్వడం కూడా చూస్తుంటాం. ఇక ట్విట్టర్ లో అయితే రష్మీ దాదాపు మూగజీవాల గురించే ఎక్కువగా పోస్టులు పెడుతుంది.
ఎక్కడ ఏ మూగజీవికి హాని జరిగినా తట్టుకోలేని రష్మీ.. ఓవైపు వీధి శునకాలను దత్తత తీసుకుంటూ పోషిస్తూనే.. మరోవైపు జంతువధకు వ్యతిరేకంగా తన గొంతు వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా తమిళ నటుడు సంతానంపై ఫైర్ అయ్యింది రష్మీ. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఏమైంది? అనే వివరాల్లోకి వెళ్తే.. నటుడు సంతానం ప్రెజెంట్ ఎక్కడో విహారయాత్రలో ఉండి.. మత్తులో ఉన్న ఓ పెద్దపులి దగ్గర కూర్చొని దాని తోక పట్టుకున్న వీడియో షేర్ చేశాడు. దీంతో సంతానం వీడియో నెట్టింట వైరల్ గా మారి, ఏకంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
పైగా ‘టైగర్ లవ్’ అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించిన సంతానంపై తాజాగా రష్మీ ట్విట్టర్ లో మండిపడింది. అయితే.. సంతానం వెళ్లిన ప్లేస్ ఏంటో మెన్షన్ చేయలేదు. కానీ.. ఆ వీడియోలో అతను తోక పట్టుకున్నా పులి నీరసంగా పడుకుంది. వెంటనే పులి పడుకుందా? అని సంతానం అడగ్గానే, అక్కడున్న వ్యక్తి ఎలక్ట్రిక్ స్టిక్ తో షాకిచ్చి పులిని లేపాడు. ఇప్పుడు ఇదే వీడియోపై రియాక్ట్ అవుతూ.. నటుడు సంతానంపై, అతనికి సపోర్ట్ గా ట్వీట్ చేసినవారిపై ఫైర్ అయ్యింది రష్మీ. “సరదా కోసం ఏ జంతువునైనా హింసించడం, చంపడం తప్పు. డ్రగ్ ఇచ్చిన ఒక జంతువు పక్కన కూర్చొని ఇలాంటి ప్రదేశాలను ఇండైరెక్ట్ గా ప్రోమోట్ చేస్తున్నారని సంతానం గ్రహించాలి. ఒక జంతువుని ఇలా దాని జీవన విధానానికి దూరం చేయడం కరెక్ట్ కాదు’ అని ట్వీట్ చేసింది.
Killing or torturing any kind animal for pleasure /taste /entertainment is wrong @iamsanthanam needs to realise tat he might indirectly end up promoting places like these and sitting next to a drugged animal who has been kept away from his natural habitat is not normal https://t.co/94qbY10sdx
— rashmi gautam (@rashmigautam27) December 28, 2022
I would have appreciated @iamsanthanam if he wud have shared his honest experience and asked people to learn from his mistake and never ever visit such parks which harbour animal abuse https://t.co/2m3GaUmpMh
— rashmi gautam (@rashmigautam27) December 28, 2022
ఇక రష్మీ ట్వీట్ పై నెటిజెన్ కామెంట్ చేస్తూ.. ‘జనాలు జంతుహింస గురించి చెబుతుంటే నవ్వొస్తుంది. కోళ్లు, పందులు, చేపలు, మాంసం తినేటప్పుడు ఈ విలువలేవి గుర్తుకురావు. మాంసపు దుకాణదారులు అమాయక జంతువులను చంపేస్తుంటే ఎవ్వరూ ప్రశ్నించరు. సంతానం పెట్టిన వీడియోలో అక్కడున్న వ్యక్తి, ఎలక్ట్రిక్ స్టిక్ తో పులికి షాక్ ఇవ్వడం తప్పే. కానీ.. ఆ పులి దగ్గర కూర్చోవడంలో తప్పులేదు. నటుడు సంతానం ఏమైనా డ్రగ్స్ ఇచ్చిన పులిని ప్రమోట్ చేస్తున్నాడా? టైగర్ డ్రగ్స్ తీసుకోవడం ఆ వీడియోలో చూపించారా? ఇంట్లో పెంచుకునే పెట్ డాగ్ లాగే ఇది కూడా ట్రైనింగ్ ఇచ్చిన పులి కావచ్చు. అరబిక్ దేశాల్లో జనాలు పులులను ఇళ్లలో పెంచుకుంటారు. ఎలాంటి మత్తు ఇవ్వకుండా వాటికి శిక్షణ ఇస్తారు. కాబట్టి డ్రగ్స్ గురించి మాట్లాడే ముందు నిజాలు తెలుసుకోవాలి’’ అని ట్వీట్ పెట్టాడు.
I think u and everyone who has seen this video can clearly see tat the tiger towards the end was electrocuted
And do u think it is natural,normal nd correct to tame a wild animal
I hope u r not in favor of Dubai people having tigers as pets cause that is equally wrong https://t.co/RtG5SMBo1x— rashmi gautam (@rashmigautam27) December 28, 2022
అంతటితో రష్మీ ఆగకుండా సదరు నెటిజెన్ ట్వీట్ కి ఘాటుగా స్పందిస్తూ.. “మీతో పాటు ఈ వీడియో చూసిన అందరికీ పులికి షాక్ ఇవ్వడం స్పష్టంగా కనిపిస్తోంది. అలా షాక్ ఇవ్వడం నార్మల్ అని అనుకుంటున్నారా? ఒక జంతువుతో అలా ప్రవర్తించడం మీకు కరెక్ట్ అనిపిస్తుందా? దుబాయ్ లో పులులను పెంచుకోవడం ఖచ్చితంగా తప్పు. దుబాయ్ జనాలు చేసేపనికి మీరు సపోర్ట్ చేయరని భావిస్తున్నాను” అని రష్మీ క్లాస్ పీకింది. ఇక జంతువులను హింసించే పార్కులను సందర్శించవద్దని, చేసింది తప్పని ఇప్పటికైనా గ్రహిస్తే సంతానంని అభినందించేదాన్ని అని రష్మీ తెలిపింది. ప్రస్తుతం సంతానం వీడియోపై రష్మీ పెట్టిన ట్వీట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మరి సంతానం వీడియోపై, రష్మీ ట్వీట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
Exactly u need 2 get ur facts rite @iamsanthanam has glorified this part of tourism which needs to be shut down for good it’s all about demand and supply
Wild animals need to be left in the wild free of human invasion
And pls don’t compare dogs and tigers thats basic https://t.co/RtG5SMBo1x— rashmi gautam (@rashmigautam27) December 28, 2022