ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీలకు ఏమైనా వారి అభిమానులు కంగారు పడిపోతుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలు అనారోగ్యానికి గురయ్యారని, హాస్పిటల్ లో చేరారని తెలిస్తే ఫ్యాన్స్ లో టెన్షన్ అంతా ఇంతా కాదు. అయితే.. ఇటీవల అనారోగ్యానికి గురై యాంకర్ లాస్య హాస్పిటల్ లో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు ఏమైందని విషయం తెలియలేదు. కానీ.. ఆమె భర్తే త్వరగా కోలుకోవాలంటూ స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేసేసరికి వార్త బయటికి వచ్చింది.
ఇక యాంకర్ లాస్య గురించి తెలుగు బుల్లితెర ఫ్యాన్స్ కి, బిగ్ బాస్ ఫాలోయర్స్ కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే.. యాంకరింగ్ తో కెరీర్ ప్రారంభించిన లాస్య.. చీమ, ఏనుగు జోక్స్ తో బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత అడపాదడపా టీవీ షోలు, సినిమాలు చేసి, బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొంది. బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టినా లాస్యను సోషల్ మీడియా ఫాలోయింగ్ పెరిగిందేగానీ, పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ.. సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటోంది లాస్య.
ఇదిలా ఉండగా.. లాస్య ఎందుకు హాస్పిటల్ లో చేరిందో కారణం తెలియలేదు. కానీ.. చేరిన వార్త అయితే ఆమె భర్త మంజునాథ్ పోస్ట్ ద్వారా తెలిసింది. ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ కొన్ని గంటల క్రితం పోస్ట్ చేసిన వీడియోలో యాంకర్ లాస్య కూడా ఉంది. ఓ సాంగ్ పాడే ఫన్నీ ఛాలెంజ్ లో మెహబూబ్, తన గ్యాంగ్ తో పాటు యాంకర్ లాస్య, ఆమె భర్త మంజునాథ్ ఇద్దరూ కూడా చాలా హ్యాపీగా ఛాలెంజ్ లో పాల్గొనడం మనం వీడియోలో చూడవచ్చు. దీంతో లాస్య హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యిందనే వార్తలు వెలువడుతున్నాయి. దీంతో లాస్య విషయంలో ఫ్యాన్స్ కంగారుపడే అవసరం లేదని అనుకోవచ్చు. మరి యాంకర్ లాస్య గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.