యాంకర్ అనసూయ.. జబర్దస్త్ కామెడీ షోతో స్టార్ హీరోయిన్ రేంజ్ అభిమానులను సొంతం చేసుకుంది. అంతేకాకుండా అనసూయకు సోషల్ మీడియాలో పదికిపైగా ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి. తాజాగా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన అనసూయ మరికొన్ని షోస్, స్పెషల్ ఈవెంట్స్ చేస్తోంది. జబర్దస్త్ కు కొత్త యాంకర్ అంటూ రిలీజ్ అయిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఆ తర్వాత ఆమె రష్మీ అంటూ కామెంట్స్ వస్తన్నాయి.
అయితే అనసూయ జబర్దస్త్ కు గుడ్ పై చెప్పిన తర్వాత కొత్తగా ఎవరు యాంకర్ అవుతారని అంతా ఊహాగానాలు చేస్తున్నారు. అనసూయ మాత్రం ఒకపక్క షోలు, మరోపక్క సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. పుష్ప-2 సినిమా కూడా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చెబుతున్నారు. మరోవైపు క్రిష్ జాగర్లమూడి చేసే వెబ్ సిరీస్లో అనసూయకు మంచి రోల్ ఉందంటున్నారు.
అనసూయ ఎప్పుడూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఫొటోస్, రీల్స్ చేస్తూనే ఉంటుంది. తాజాగా కొన్ని పాత ఫొటోలను షేర్ చేసింది. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లినప్పటి ఫొటోలను అభిమానులతో పంచుకుంది. సముద్ర తీరం నన్ను మిస్ అవుతుందేమో? అంటూ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అనసూయ వైరల్ ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.