అనసూయ.. బుల్లితెర నుంచి వచ్చిన ఈ భామ వెండితెరపై రంగమ్మత్తగా తనదైన ముద్ర వేసుకుంది. పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులు హృదయాలను కొల్లగొడుతోంది. ఇక అనసూయకు సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి టూర్లు వేయడం సరదా. ఆ టూర్లలో తాను దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా తన కుటుంబంతో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లిన అనసూయ ఆ ఫొటోలను తన ఇన్ స్టా బ్లాగ్ లో పోస్ట్ చేసి దానికి కొన్ని.. భావాలను కూడా కోట్ చేసింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. అనసూయ అందంతో ఎంత పాపులర్ అయ్యిందో.. విమర్శలతో కూడా అంతే పాపులర్ అయ్యింది.
తాజాగా తనని ఆంటీ అని ట్రోల్ చేస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఇక తనపై వస్తున్న ట్రోల్స్ కు అంతే ఘాటుగా సమాధానాలు ఇస్తూ ఉంటుంది. ఇక తన ఫ్యామిలీ లైఫ్ లోకి వస్తే.. తను ఎంత బిజీగా ఉన్న తన కుటుంబానికి టైమ్ కేటాయిస్తుంది. సమయం చిక్కినప్పుడల్లా టూర్లు వేస్తుంటారు అనసూయ దంపతులు. అలా టూర్లలో దిగిన ఫొటోలను తన అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ రెస్టారెంట్ కు వెళ్లిన అనసూయ తన పిక్స్ ను పోస్ట్ చేసింది. డిమ్ లైట్ వెలుగుల్లో అనసూయ తన అందాలతో కుర్రకారు మతులు పోగొడుతోంది. తనదైన హావభావాలతో ఫోటోలకు పోజులిచ్చింది రంగమ్మత్త.
ఈ క్రమంలోనే ఓ రెస్టారెంట్ లో తన హాట్ హాట్ అందాలతో యువతకు విందు చేసింది. రకరకాల వేరియేషన్స్ తో పోజులు ఇచ్చింది. ఒక పిక్ లో కవ్విస్తూ.. మరో ఫొటోలో ఎక్కిరిస్తూ.. ఇంకో సారి సిరియస్ గా ఎదో పనిలో ఉన్నట్లు పోజులు ఇచ్చింది. ఇక ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. టాప్ ను తీసి మరి రచ్చ చేసింది. ఈ పిక్ కు తన భావాలను జత చేసింది.” మీరు దేని కోసం జీవిస్తున్నారో ముందు తెలుసుకోండి. దాని కోసం మీ సమయాన్ని కేటాయించండి. అలాగే మీరు టైమ్ ను నమ్మండి. మీరందరు నెగటివిటి వీడి మంచి మనసుతో ఉంటారని కోరుకుంటున్నా” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ రెస్టారెంట్ లో దిగిన పిక్స్ వైరల్ గా మారాయి. మరి అనసూయ ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.