యాంకర్స్ అంటే ఎప్పుడు హుషారుగా కలర్ ఫుల్ గా కనిపిస్తుంటారు. ప్రేక్షకుల్ని ప్రతి క్షణం ఎంటర్ టైన్ చేయడానికే ప్రయత్నిస్తుంటారు. కానీ వాళ్లకు ఓ నార్మల్ లైఫ్ ఉంటుంది. వాళ్లు కూడా ఎన్నో ఎమోషన్స్ టైం వచ్చినప్పుడు బయటపెడుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే వాళ్లకు గతంలో ఏం జరిగింది అనే సందేహం వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ.. సడన్ గా ఓ పోస్ట్ పెట్టింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగులో లేడీ యాంకర్ అనగానే సుమ ఎలా గుర్తొస్తుందో, అనసూయ కూడా చాలామంది గుర్తొస్తుంది. న్యూస్ రీడర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ‘జబర్దస్త్’ యాంకర్ గా చాలా గుర్తింపు తెచ్చుకుంది. షో మొదలైనప్పటి నుంచి మొన్నమొన్నటి వరకు యాంకర్ గా చేస్తూ వచ్చింది. ఎంతో పేరు సంపాదించింది. అదే టైంలో రంగస్థలం, పుష్ప లాంటి సినిమాల్లో అద్భుతమైన రోల్స్ చేసి, నటిగానూ ఫేమ్ సంపాదించింది. ప్రస్తుతం షోలు చేయడం మానేసి, మూవీస్ పైనే పూర్తి దృష్టి పెట్టింది.
ఇక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉండే అనసూయ.. తనని ఎవరు ట్రోల్ చేసినా సరే వారికే అదే రేంజ్ లో ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. ఇక ఫొటోలు, వీడియోలతో ఫ్యాన్స్ ని ఎప్పుడూ ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటుంది. అలాంటి అనసూయ.. తాజాగా తన ఇన్ స్టాలో బాధాకరమైన ఓ కోట్ ని స్టోరీలో పోస్ట్ చేసింది. ‘నేను దారుణంగా దెబ్బతిన్నాను. నేను హర్ట్ అయినంతగా ఎవరినీ హర్ట్ చేయలేదు’ అని ఆ స్టోరీలో ఉంది. ఇది చూసిన పలువురు నెటిజన్స్.. అనసూయని ఎవరు ఇబ్బంది పెట్టారా అని తెగ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.