‘జబర్దస్త్’ రెండు తెలుగు రాష్ట్రాలను కడుపుబ్బా నవ్విస్తున్న ఖతర్నాక్ కామెడీ షో. ఇక ఈ షో ద్వారా ఎంతో మంది ప్రతిభావంతమైన కమెడియన్ లు వెలుగులోకి వచ్చారు. వారితో పాటుగా తన అందంతో, చలాకితనంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ అనసూయ. జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ తో పెద్ద పెద్ద సినిమాల్లో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది ఈ సోయగం. ఇక ఆమెతో పాటుగా ఓ చిన్నపాటి స్టార్ హీరోకు సమానమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. ఈ క్రేజ్ తోనే వెండితెరపై హీరోగా అడుగుపెట్టి రాణిస్తున్నాడు. అయితే తాజాగా జరిగిన ఓ మూవీ ఈవెంట్ లో సుధీర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది యాంకర్ అనసూయ. సుధీర్ నా జూనియర్ అని అతడు నా నుంచి చాలా నేర్చుకున్నాడు అని చెప్పుకొచ్చింది.
అనసూయ భరద్వాజ్.. బుల్లితెర యాంకర్ గా తన ప్రయాణం మెుదలు పెట్టి నేను పెద్ద పెద్ద సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ.. దూసుకెళ్తోంది. రంగస్థలంలో రంగమ్మత్త, పుష్ఫలో మంగళం శ్రీను భార్య పాత్రలలో మెరిసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక అప్పుడప్పుడు వివాదాలకు సైతం అనసూయ కేంద్ర బిందువుగా మారిన సంగతి మనందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే జబర్దస్త్ మానేసిన అనసూయ సినిమాలపై ఫోకస్ పెట్టింది. వరుస మూవీ ఆఫర్లతో బిజీబిజీగా ఉంటోంది. ఇక తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. సుధీర్ తో వర్క్ చేయడం ఎలా ఉంది? అని రిపోర్టర్ ప్రశ్నించగా.. కాస్త సీరియస్ అయినట్లు కనిపించింది. సుధీర్ గురించి మాట్లాడుతూ..
🙄🙄 ee lekkana pedda hero movies lo mother characters cheysey vallani aa hero tho cheyadam ela undi ani adagoddu annatlu #anasuyabharadwaj #Anasuya #Aunty pic.twitter.com/VmQ1P8ojGr
— Idly_Vishwanatham (@Idly_Baba) December 14, 2022
“సుధీర్ నా జూనియర్. నేను సీనియర్ ని మర్చిపోయారా? నాతో కలిసి పనిచేయడం ఎలా ఉందో సుధీర్ ని అడగండి నన్ను కాదు. అతడు నా నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. నేనూ అతడి నుంచి చాలా విషయాలను నేర్చుకున్నాను” అని అనసూయ చెప్పుకొచ్చింది. సుధీర్ సినిమా విషయంలో చాలా కష్టపడతాడు. అతడితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంటుంది అని అనసూయ అన్నారు. అయితే అనసూయ చేసిన ఈ వాఖ్యలపై నెట్టింట విమర్శలు చేస్తున్నారు. సుధీర్ ను జూనియర్ అనడం ఏంటి? ఈ మధ్య కాలంలో చేసిన రెండు మూడు సినిమాలకే ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.