అనసూయ.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాంకర్‌గా పరిచయం అయ్యి.. ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. బుల్లితెరకు పూర్తిగా దూరమైన అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అనసూయ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో అనసూయ నటించింది. అయితే సినిమాలో నటించిన అనసూయ.. ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించలేదు. గాడ్‌ఫాదర్ మూవీలో ఓ మీడియా ఛానల్ ప్రతినిథిగా అనసూయ కనిపిస్తుంది. చిరంజీవి సినిమాలో నటించినప్పటికి.. ప్రమోషన్స్‌లో కనిపించకపోవడంతో.. ఆమెని ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు నెటిజనులు.
అయితే వరుస షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్లే.. సినిమా ప్రమోషన్‌లో పాల్గొనలేదని అనసూయ చెప్పుకొచ్చింది. అయినప్పటికి అనసూయ మీద ట్రోల్స్ ఆగలేదు. ఈ క్రమంలో తనపై వస్తోన్న విమర్శల మీద అనసూయ స్పందించింది. నేనంటే ఎందుకు మీకు అంత ప్రేమ.. అంటూ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా అనసూయ.. ‘‘ఎందుకు నేనంటే మీకు అంత పిచ్చి ప్రేమ.. నేను మీకు చాలా ముఖ్యం. నేను ఏదన్నా అంటే మీరు ఫీల్ అవుతారు.. అయ్యో పిచ్చి క్యూటీస్.. ఇప్పుడు ఆ పిచ్చి క్యూటీస్ మళ్లీ రియాక్ట్ అవుతారా.. సరే మీ దగ్గర నా కోసం అంత టైం ఉంటే మీ ఇష్టం’ అంటూ సెటైర్లు వేసింది అనసూయ.
😂😂 Yendukura nenante meeku anta pichi prema.. nenedanna meeku anta important.. edanna anta feel autaru.. ayyooo pichi cuties.. ippudu “aa picchi cuties” andaru malli feel ayyi react autara?? Sare meeku nakosam anta time undante mee ishtam 😅
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 7, 2022
మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన లూసిఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కిన చిత్రం గాడ్‌ఫాదర్. మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సత్యదేవ్, నయనతార కీలకపాత్రల్లో నటించారు. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ముఖ్య పాత్రలో కనిపించాడు. ఇక సినిమాలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, సునీల్, గెటప్ శ్రీను ఇలా ఎంతో మంది సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఇక గాడ్ ఫాదర్ సినిమాలో చిరు బ్రహ్మగా అలరించారు. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.