అనసూయ భరద్వాజ్.. బుల్లితెర, వెండితెర రెండింట తానేంటో నిరూపించుకుంది. కెరీర్‌లో ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎదగాలనుకునే వారికి అనసూయ ఆదర్శంగా నిలుస్తోంది. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు మోస్ట్ సక్సెస్‌ఫుల్ యాంకర్, నటిగా కొనసాగుతోంది. అనసూయకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమెకు పదికి పైగా ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి.
అయితే అనసూయకు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో.. అంతే ట్రోలర్స్ కూడా ఉన్నారు. నిజానికి అనసూయ అనుకున్నది అనుకున్నట్లు పైకి చెప్పేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఆ విషయాల్లో ట్రోలింగ్ కు కూడా గురైంది. కానీ, ఎప్పుడూ ఆమె స్టాండ్ మార్చుకోలేదు. తాను చెప్పిన మాట మీద నిలబడుతూ ట్రోలర్స్ కు సమాధానం చెబుతూ ఉండేది.
ప్రస్తుతం అనసూయ చేసిన ఓ ట్వీట్ మరోసారి అగ్గి రాజేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ విషయంలో ఆమెపై ట్రోలింగ్ నడుస్తోంది. ఆగస్టు 25న అనసూయ ఏం ట్వీట్ చేసిందంటే.. “అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!” అంటూ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ విజయ్ దేవరకొండ కోసమే అంటూ ఫ్యాన్స్ రచ్చ షురూ చేశారు.
నిన్నటి నుంచి అనసూయపై ట్విట్టర్ వేదికగా బూతులతో విరుచుకుపడుతున్నారు. అయితే అనసూయ ఎక్కడా తగ్గకుండా వారికి సమాధానం చెబుతూ వస్తోంది. అంతేకాకుండా వారు పెట్టే ప్రతి బూతు ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ వస్తోంది. అంతేకాకుండా ప్రతి అబ్యూసింగ్ అకౌంట్ స్క్రీన్‌షాట్ తీసుకుంటున్నట్లు వెల్లడించింది. త్వరలోనే వారందరిపై ఫిర్యాదు చేస్తానంటూ చెబుతోంది.
ఎవరైతే ట్వీట్ల రూపంలో తనపై సోషల్ మీడియా వేదికగా దాడి చేస్తున్నారో.. వారి తప్పును తెలుసుకునే వరకు, వారు ఇలాంటి మెసేజ్‌లు పెట్టడం ఆపే వరకు ప్రతి ట్వీట్‌ను రీట్వీట్ చేస్తానంటూ చెప్పింది. ‘నేను ఫ్యాన్స్ అనే ముసుగులో దాక్కునే పిరికి పందను కాదు. డబ్బులిచ్చి.. ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా నన్ను తిట్టించడం, ఇన్నేళ్లుగా నన్ను ట్యాగ్ చేస్తుంటే నీకు తెలియలేదా ఏం జరిగిందో?” అంటూ ప్రశ్నించింది. అయితే ఈ ప్రశ్న ఎవరికి అనే కొత్త ప్రశ్న వచ్చింది. అనసూయ- నెటిజన్స్ మధ్య జరుగుతున్న యుద్ధంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Tried that andi..didn’t work!Just had a conversation with the Cybercrime and they responded so prompt..I will prove what can happen if you think its your right to abuse anyone for anything..blocking aite nene chesestanu..but I want suspensions and arrests!
SayNOtoOnlineAbuse https://t.co/eEDR6BFa6K
— Anasuya Bharadwaj (@anusuyakhasba) August 26, 2022