హీరోయిన్ అమలాపాల్ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్స్ రెచ్చిపోయి మరీ కామెంట్స్ చేస్తున్నారు.
అమలాపాల్ పేరు చెప్పగానే ఆమె సినిమాల కంటే ముందు కాంట్రవర్సీలే గుర్తొస్తాయి. సౌత్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ‘మైనా’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. అలా స్టార్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే డైరెక్టర్ ఏఎల్ విజయ్ ని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లపాటు బాగానే ఉన్నారు కానీ రెండేళ్లు కూడా కాకముందే విడాకులు తీసుకున్నారు. రీసెంట్ గానూ ఓ గుడికి వెళ్లే విషయమై చిన్నపాటి వివాదంలో చిక్కుకుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన అమలాపాల్.. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి, విడాకులు, వివాదాలు, ఆరోపణలు, పోలీస్ కేసులు అని ఎప్పుడూ కాంట్రవర్సీలతో సావాసం చేస్తూనే ఉంటుంది. ఈ మధ్యే కేరళలోని ఓ హిందూ దేవాలయానికి అమలాపాల్ వెళ్లగా.. అక్కడి అర్చకులు ఈమెని అడ్డగించారు. వేరే మతానికి చెందిన ఈమెకు గుడిలోకి ప్రవేశం లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఈ గుడికి ఎంట్రీ లేకపోయినప్పటికీ.. మిగతా టెంపుల్స్ ని సందర్శిస్తూ ఉంది. రీసెంట్ గా తమిళనాడులోని పళని కుమారస్వామి ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసకుంది.
ప్రస్తుతం బాలి పర్యటనలో ఉన్న హీరోయిన్ అమలాపాల్.. ఓ ఆశ్రమంలో బస చేసింది. అక్కడ ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తీసుకుంటూ యోగా ధ్యానంలో మునిగిపోయింది. ఇదే విషయాన్ని అమలాపాల్ తన ఇన్ స్టాలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంది. తాజాగా అందుకు సంబంధించి కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ఓ వీడియో కూడా వైరల్ అయింది. ఇందులో రెడ్ టాప్ లో కనిపిస్తున్న అమలాపాల్.. జూమ్ చేసిన ఫొటోలను పోస్ట్ చేసింది. వీటిని చూసిన కొందరు నెటిజన్స్ టెంప్ట్ అవుతున్నారు. ఆ వెంటనే కూల్ కూల్ అంటూ సముదాయించుకుంటున్నారు. మరి అమలాపాల్ తాజా ఫొటోలు చూడగానే మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.