అమలాపాల్ బీచ్‌లో బికినీతో ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే హీరోయిన్స్‌లో అమలా పాల్ ఒకరు. ఆమె తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ఉంటారు. ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలా ఆమె షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు అప్పుడప్పుడూ వైరల్‌గా మారుతూ ఉంటాయి. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అమలా పాల్ బీచ్‌లో బికినీతో ఉన్న వీడియో అది. బీచ్‌లో బికినీతో సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేస్తూ ఆమె తన ఫ్రెండ్‌తో వీడియో తీయించుకున్నారు. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. ఇప్పటికే మూడు లక్షలకు పైగా వ్యూస్, లక్షల లైక్స్‌తో దూసుకుపోతోంది.
వేల మంది దీనిపై కామెంట్లు చేశారు. కొంతమంది వ్యంగ్యంగా.. ఇంకా కొంతమంది విమర్శపూర్వకంగా ఈ వీడియోపై స్పందిస్తున్నారు. కాగా, కేరళ కుట్టి అమలాపాల్ 2009లో వచ్చిన ‘నీలతామర’ అనే మలయాళ సినిమాతో సినిమా రంగ ప్రవేశం చేశారు. బెజవాడ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. నాని, రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు. తెలుగులో తీసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీసుల్లోనూ నటిస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.