‘పుష్ప ది రైజ్’ అంటూ సుకుమార్- అల్లు అర్జున్ కాంబో హ్యాట్రిక్ కొట్టిన విషయం తెలిసిందే. అన్ని చోట్ల కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సందర్భంగా సినిమా యూనిట్ సక్సెస్ మీట్లు ప్లాన్ చేసింది. ఇప్పటికే తిరుపతి, చెన్నైలలో సక్సెస్ మీట్లు పూర్తి చేసుకోగా.. డిసెంబరు 24న కాకినాడలో సక్సెస్ మీట్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ, చివరి క్షణంలో ఆ మీట్ క్యాన్సిల్ అయినట్లు ప్రకటించారు.
‘ఈరోజు కాకినాడలో జరగాల్సిన పుష్ప ది రైజ్ మ్యాసివ్ సక్సెస్ మీట్ ను పర్మిషన్స్ కారణంగా రద్దు చేయబడింది’ అంటూ చిత్ర బృందం ప్రకటించింది. కానీ, అందుకు తగిన కారణాలను మాత్రం వెల్లడించలేదు. మళ్లీ కాకినాడ సక్సెస్ మీట్ ను మరోచోట నిర్వహిస్తారా? లేక పూర్తిగా రద్దు చేస్తారా? అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాకుండా రద్దు చేయడానికి గల కారణాలను సైతం వెల్లడించలేదు. అధికారులు అసలు ఎందుకు అనుమతి ఇవ్వలేదు అనే దానిపై కూడా స్పష్టత లేదు. పుష్ప ది రైజ్ సక్సెస్ మీట్ ను కాకినాడలో ఎందుకు అనుమతించలేదు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— tiru (@tiru9676) December 24, 2021