ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హోదా వచ్చిన విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా బాలీవుడ్ సహా యావత్ ఇండియన్ సినిమాని ఓ ఊపు ఊపేశాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మాస్ లుక్స్, మేనరిజం, డైలాగ్స్ అన్నీ విధాలుగా ప్రేక్షకులకు పూనకాలు తెప్పించారు. బాలీవుడ్ ప్రేక్షకులైతే పుష్పరాజ్ కు నీరాజనాలు పట్టారు. సుకుమార్ మూవీకి స్ట్రైట్ బాలీవుడ్ సినిమాలకు సైతం దక్కని క్రేజ్ పుష్ప సినిమాకు దక్కింది. ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు, సెలబ్రిటీలు, ఫుట్ బాల్ ప్లేయర్లు మొత్తం తగ్గేదేలే అంటూ రీల్స్ చేశారు. ఇటీవల కూడా ఓ నేపాల్ మహిళా క్రికెటర్ వికెట్ తీసి పుష్ప మేనరిజంతో సెలబ్రేషన్ చేసుకుంది. అంతటి క్రేజ్ సొంతం చేసుకున్న పుష్ప సినిమాకి పార్ట్ కూడా తొందర్లోనే రానున్న విషయం తెలిసిందే.
అయితే పుష్ప-2 సినిమా గురించి అప్పుడే ఊహాగానాలు, స్టోరీ ప్రిడిక్షన్స్, అనాలసిస్లు మొదలుపెట్టేశారు. అయితే వాటిలో ఒక లైన్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మామూలుగా పుష్ప పార్ట్- 1లో అల్లు అర్జన్ ఒక ఎర్ర చందనం కూలీగా తన కెరీర్ మొదలు పెట్టి తన ఐడియాస్ లో కొండారెడ్డికి పార్టనర్ అవుతాడు. కొండారెడ్డి మరణించిన తర్వాత మంగళం శ్రీనుకు ఎదురెళ్లి సిండికేట్ మొత్తాన్ని తన గుప్పెట్లోకి తీసుకుంటాడు. ఆ క్రమంలోనే అటు ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ కు కూడా శత్రువుగా మారతాడు. అలా పుష్ప సిండికేట్ ని తన గెప్పెట్లోకి తీసుకుని, శ్రీవల్లిని పెళ్లి చేసుకోవడంతో పుష్ప సినిమా ముగుస్తుంది.
ఇదీ చదవండి: ఆర్యవైశ్యులకు క్షమాపణ చెప్పిన జీవితా రాజశేఖర్.. ‘తప్పుగా ప్రచారం చేస్తున్నారు’!ఆ తర్వాత పుష్పరాజ్ ఎలా ఎదిగాడు, తన శత్రువులను ఎలా ఎదిరించాడు అనేది రెండో పార్ట్ లో చూపించనున్నారు. అందుకే ఆ పార్టుకు పుష్ప: ది రూల్ అని టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. రూల్ అంటే ఎలా పాలించనున్నాడు, తన ఐడియాస్ తో ఎర్రచందనం స్మగ్లింగ్ ను ఏ స్థాయికి తీసుకెళ్లనున్నాడో చూపించనున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లైన్ ఏంటంటే.. జాలిరెడ్డి, మంగళం శ్రీను, భన్వర్ సింగ్ షెకావత్ లు తమ పుష్పరాజ్ మీద పగ తీర్చుకునేందుకు కేశవను పావుగా వాడుకోబోతున్నారు అని. పుష్ప కూలీగా ఉన్నప్పటి నుంచి పుష్పకు రైట్ హ్యాండ్ గా ఉండి కేశవ అన్ని పనులు చక్కబెడుతూ ఉన్నాడు.
మరి, కేశవను తమవైపు ఎలా తిప్పుకుంటారు? కేశవ ద్వారా పుష్పని ఎలా ఇబ్బందులు పెడతారు అనేది పార్ట్ 2లో హైలెట్గా నిలుస్తుందని చెబుతున్నారు. తమ వాదనను సపోర్ట్ చేసుకునేందుకు.. స్టోరీ స్టార్టింగ్ లో కేశవ తాను డబ్బు సంపాదించడానికే వచ్చానని.. తన ఫ్యామిలీ కష్టాలు తీరడానికి డబ్బు కావాలని చెబుతాడు. ఆ మాటలను సపోర్ట్ గా చేస్తూ డబ్బు కోసమే కేశవ విలన్లతో చేతులు కలిపి పుష్పరాజ్ ను దెబ్బకొడతాడని చెబుతున్నారు. ఈ లైన్ ను బాహుబలిలో కట్టప్ప వెన్నుపోటు పొడవాడినికి ముడిపెట్టి.. అంతకన్నా మించిన ట్విస్ట్ ఉంటుంది పార్ట్ 2లో అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అభిమానులు స్టోరీ వినడానికి బాగానే ఉంది.. మరి, సుకుమార్ కూడా అలాగే చేస్తాడా అంటూ డౌటనుమానం వెల్లిబుచ్చుతున్నారు. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే అయితే సుకుమార్ స్టోరీ మీద హింట్ ఇవ్వాలి, లేదా పుష్ప పార్ట్ 2 సినిమా విడుదల కావాలంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమా ఎలా ఉండబోతోంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.