టాలీవుడ్ నుండి అందరూ అత్రుతుగా ఎదురుచూస్తున్న సినిమాలలో పుష్ప కూడా ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత సుకుమార్ తీస్తున్న మూవీ కావడంతో.. ఆ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
ఈ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. అల్లు అర్జున్, సుకుమార్, దేవి కాంబోలో గతంలో సూపర్ హిట్ ఆల్బమ్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రేంజ్ కి తగ్గట్టే పుష్ప కోసం దేవి అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేస్తున్నాడట. అయితే.., తాజాగా ‘పుష్ప’ లోని ఓ ఆడియో సాంగ్ లీక్ అయినట్టు తెలుస్తోంది.
పుష్ప మూవీలో సాంగ్ అంటూ.. ఓ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీవల్లి అంటూ సాగుతున్న ఈ మెలోడీ సాంగ్ లో దేవి శ్రీ ప్రసాద్ వాయిస్ వినిపిస్తుండటంతో ఇది పుష్ప మూవీలోని పాటే అన్న కామెంట్స్ కి బలం చేకూరుతోంది.
డ్యాన్స్ ప్రాక్టీస్లో ఈ పాటని సెట్ లో ప్లే చేయగా, ఎవరో రికార్డ్ చేసి లీక్ చేసినట్టు అర్ధం అవుతోంది. బన్నీ ఫ్యాన్స్ మాత్రం సాంగ్ సూపర్ అంటూ అప్పుడే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసేస్తున్నారు. మరి.., నిజంగానే ఈ పాట పుష్ప మూవీలోనిదా? కాదా? అన్న విషయం తెలియాల్సి ఉంది.