సినీ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరోల ఫ్యామిలీ విషయాలను, వారి పిల్లల విషయాలను తెలుసుకునేందుకు అభిమానులు, ప్రేక్షకులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా తెలుగు హీరోలు తమ ఫ్యామిలీ. పిల్లలకు సంబంధించి ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పిల్లల విషయాలను అభిమానులతో షేర్ చేసుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. అల్లు అర్జున్ కూతురు అర్హ చేసే అల్లరి గురించి అందరికి తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్, తన కూతురు అర్హతో కలిసి చేసిన విన్యాసం నెట్టింట వైరల్ అవుతోంది.
జనరల్ గా అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించి ఏ విశేషం ఉన్నా.. పిల్లలు కొత్తగా ఏం చేసినా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు ఆయన భార్య స్నేహ. బన్నీ ఎప్పుడు పిల్లలతో ఆటలాడినా.. వారితో సరదాగా గడిపిన ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంటారు. తాజాగా అల్లు అర్హ, బన్నీతో కలిసి వారి ఇంటి పెరట్లో ఓ విన్యాసం చేసింది. ఇద్దరూ ఒక్కో చోట పోల్స్ కి వేలాడుతూ పోటీ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఎవరు ఎక్కువసేపు ఆ పోల్ కి వేలాడతారో వారే విన్ అనేది గేమ్ రూల్.
తండ్రికూతురు పోటీకి సంబంధించి వీడియో షేర్ చేశారు స్నేహ. ఈ వీడియోలో అల్లు అర్జున్ తన కూతురుతో సరదాగా పోల్ గేమ్ ఆడింది మనం చూడవచ్చు. అయితే.. ఈ పోటీలో బన్నీ కంటే అర్హ ఎక్కువసేపు వేలాడటం మరో విశేషం. అనంతరం బన్నీ అర్హ దగ్గరికి వెళ్లి హగ్ చేసుకోవడం క్యూట్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న బన్నీ.. త్వరలోనే డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప-2 సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మరి బన్నీ – అర్హ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.