వాలెంటైన్స్ డే.. సామాన్యులంటే ప్రపోజల్స్.. ఆల్రెడీ ప్రేమలో ఉంటే గిఫ్టులతో సరిపెట్టుకుంటారు. హీరోలు/హీరోయిన్స్ వాలెంటైన్స్ డేని ఎలా జరుపుకున్నారు? అని తెలుసుకోవాలనే ఆరాటం అందరి ఫ్యాన్స్ లోనూ కనబడుతుంది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ కొత్త లుక్ లో కనిపించి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు.
వాలెంటైన్స్ డే.. ప్రేమికులందరికీ ఎంతో స్పెషల్. కామన్ పీపుల్ నుండి సెలబ్రిటీల వరకు అందరూ ప్రేమలో పడిన సందర్భాలను.. ప్రేమించినవారితో జ్ఞాపకాలను, పెళ్ళయితే భార్య/భర్తతో బయటికి వెళ్లడం.. వాలెంటైన్ మూమెంట్ ని ఎంతో స్పెషల్ గా సెలబ్రేట్ జరుపుకోవడం చేస్తుంటారు. కాగా.. సామాన్యులంటే ప్రపోజల్స్.. ఆల్రెడీ ప్రేమలో ఉంటే గిఫ్టులతో సరిపెట్టుకుంటారు. కానీ.. సెలబ్రిటీల విషయాలలో కూడా దాదాపు సేమ్ జరుగుతుంది. అయినా.. అభిమాన హీరోలు/హీరోయిన్స్ వాలెంటైన్స్ డేని ఎలా జరుపుకున్నారు? అని తెలుసుకోవాలనే ఆరాటం అందరి ఫ్యాన్స్ లోనూ కనబడుతుంది.
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ కొత్త లుక్ లో కనిపించి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు. భార్య స్నేహారెడ్డితో కలిసి అల్లు అర్జున్ స్పెషల్ లంచ్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బన్నీని పిక్ తీసి తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. దీంతో ఇప్పుడు బన్నీ లుక్ చూసినవారంతా సర్ప్రైజ్ అవుతున్నారు. పైగా బన్నీ ప్లేట్ లో స్పెషల్ గా బిర్యానీ ఏదైనా ఉంటుందేమో అనుకున్నారు ఫ్యాన్స్. కానీ.. బన్నీ సింపుల్ డైట్ ని ఫాలో అవుతున్నట్లు సమాచారం. అందుకే బన్నీ ప్లేట్ లో బిర్యానీకి బదులు ఏదో ఫుడ్ కనిపించింది. అదీగాక ప్రెసెంట్ తదుపరి మూవీ పుష్ప 2ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు బన్నీ.
ఇదిలా ఉండగా.. టాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ పెయిర్స్ లో బన్నీ – స్నేహారెడ్డి టాప్ లో ఉంటారు. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తూ.. ఫ్యాన్స్ కి ఎంతో ఆదర్శంగా ఉంటూ వస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు అయాన్, అర్హ. పిల్లలు కూడా దాదాపు టాలీవుడ్ ఆడియెన్స్ అందరికీ సుపరిచితమే. అయితే.. ఇప్పుడు వాలెంటైన్స్ డేని బన్నీ – స్నేహ దుబాయ్ లో జరుపుకున్నట్లు తెలుస్తోంది. బన్నీ న్యూ లుక్ తో పాటు స్నేహారెడ్డి.. ఓ వీడియో కూడా షేర్ చేశారు. ప్రస్తుతం బన్నీ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ప్రెఫెషన్ వైపు.. పుష్ప 2 చేస్తున్న బన్నీ.. షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘జవాన్’ సినిమాలో కూడా నటించబోతున్నాడని టాక్ నడుస్తోంది. చూడాలి దీనిపై ఎలాంటి క్లారిటీ రానుందో! మరి బన్నీ న్యూ లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Candid click of #AlluArjun from Special Date on #ValentinesDay!!🤍🤍#AlluSnehaReddy @alluarjun #PushpaTheRule #TeluguFilmNagar pic.twitter.com/SZxmpAr3OF
— Telugu FilmNagar (@telugufilmnagar) February 14, 2023