ప్రస్తుతం షారుఖ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో.. 'జవాన్' సినిమాలో నటిస్తున్నాడు. నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి లతో పాటుగా కామియో రోల్స్ లో మెరవనున్నారు దీపికా పదుకెణె, దళపతి విజయ్. మరో స్టార్ హీరో కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
షారుఖ్ ఖాన్.. ప్రస్తుతం ‘పఠాన్’ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రికార్డ్ స్థాయి కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ. 900 కోట్లు సాధించి, వెయ్యి కోట్ల వైపు పరుగులు తీస్తోంది. ఇక ప్రస్తుతం షారుఖ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో.. ‘జవాన్’ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో భారీ స్థాయిలో తారాగాణం ఉంది. నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి లతో పాటుగా కామియో రోల్స్ లో మెరవనున్నారు దీపికా పదుకెణె, దళపతి విజయ్. దాంతో ఈ సినిమాపై అంచానాలు భారీ స్థాయిలో పెరిగాయి. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
షారుఖ్ ఖాన్.. ప్రస్తుతం పఠాన్ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులన్నింటిని తిరగరాస్తున్నాడు. ఇక షారుఖ్ తన నెక్ట్స్ మూవీని తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ సినిమా పేరే ‘జవాన్’. అట్లీ దర్శకత్వంలో సొంత బ్యానర్ అయిన రెడ్ చిల్లీస్ సంస్థ ద్వారా షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే? షారుఖ్ జవాన్ మూవీలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ కామియో రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి డైరెక్టర్ అట్లీ ఇప్పటికే అల్లు అర్జున్ ను కలిసి ఆ రోల్ గురించి చెప్పినట్లు సమాచారం. ఇక ఆ రోల్ నచ్చడంతో స్టైలిష్ స్టార్ సైతం జవాన్ సినిమాలో చెయ్యడానికి ఒప్పుకున్నాడట.
అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక సుకుమార్ కూడా పుష్ప2ను శరవేగంగా తెరకెక్కిస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో షారుఖ్ సినిమాలో కామియో రోల్ చేయడానికి ఒప్పుకుంటాడో, లేదో అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. మరి షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ వచ్చి అడిగితే.. అల్లు అర్జున్ కాదనలేకపోవచ్చు. పైగా డైరెక్టర్ అట్లీ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో జవాన్ సినిమాలో ఓ కామియో రోల్ అల్లు అర్జున్ చేసే అవకాశాలను కొట్టిపారేయ్యలేం అంటున్నారు సినీ పండితులు. ఇందుకు సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ తొందర్లోనే రాబోతుంది. మరి షారుఖ్ ఖాన్-అల్లు అర్జున్ లు కలిసి స్క్రీన్ పై కనిపిస్తే.. ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#JAWAN #AlluArjun pic.twitter.com/mQ50YAxYFn
— Aakashavaani (@TheAakashavaani) February 13, 2023